50 లక్షలు గెలిస్తే అమ్మనవుతా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ ప్రియాంక!

0
512

బిగ్ బాస్ రియాలిటీ షోలో విజేతగా నిలిచినటువంటి వారికి ప్రైస్ మనీ 50 లక్షల రూపాయలను అందిస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సీజన్లో మాత్రం 50 లక్షల ప్రైస్ మనీతో పాటు 25 లక్షల విలువచేసే సువర్ణభూమి 300 చదరపు గజాల స్థలాన్ని కూడా ఇవ్వబోతున్నట్లు నాగార్జున ప్రకటించారు.

ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో 50 లక్షల రూపాయకు గెలిస్తే ఎవరు ఏం చేస్తారని నాగార్జున అడిగారు. ఇలా నాగార్జున అడగడంతో హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లు వారి అమ్మలకి ఇస్తామని ,మరికొందరు అప్పులు కడతామని, కొందరు నిర్మాణ సంస్థను ప్రారంభిస్తామని తెలిపారు.

కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ట్రాన్స్ జెండర్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి కంటెస్టెంట్ ప్రియాంక మాత్రం తను అమ్మను అవుతానని షాకింగ్ కామెంట్ చేశారు.తనకు చిన్నప్పటి నుంచి అమ్మ అని పిలిపించుకోవాలని కోరిక ఉందని అయితే ఎవరినైనా దత్తత తీసుకొని పెంచుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని సూచించారని ప్రియాంక తెలిపారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ షో లో 50 లక్షలు గెలిస్తే తన తల్లిదండ్రులకు ఇల్లు కట్టించి అనంతరం తను ఒక అమ్మాయిని దత్తత తీసుకొని తనకు అమ్మ అవుతానని ప్రియాంక తెలిపారు. ఇలా బిగ్ బాస్ ద్వారా తన కోరికను నెరవేర్చుకుంటానని ప్రియాంక తెలిపారు.