Sarayu: బిగ్ బాస్ ఫేం, యూట్యూబ్ స్టార్ సరయుపై సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు చేపూరి ఆశోక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు నమోదు చేసిన సిరిసిల్ల పోలీసులు.. అనంతరం దాన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆమె హోటల్ ప్రమోషన్ సాంగ్‌లో ఆమెతో పాటు మరికొందరు గణపతి బప్పా మోరియా బ్యాండ్‌ను తలకు ధరించారని అశోక్ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతే కాకుండా ఆ ప్రమోషన్ సాంగ్ తో దేవుడి బొమ్మలు ధరించి.. లిక్కర్ సేవించి హోటల్ ను సందర్శిస్తారనే సంకేతాన్ని పంపుతున్నారని వెల్లడించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
సన్నీ హీరోగా నటిస్తున్న చిత్రం సకల గుణాభిరామలో..
ఇది హిందువుల మనోభావాలను కించపరచడమే అని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి చర్యలను హిందూ సమాజం సహించదన్నారు. ఈ కేసుపై సరయు వాదన తెలియాల్సి ఉంది. ఇక సరయు విషయానికి వస్తే.. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ద్వారా ఆమె ఎంతో పాపులర్ అయ్యారు. బోల్డ్ కంటెంట్ తో.. బోల్డ్ సంభాషణలతో ఆమె ఎంతో ప్రసిద్ధి. ఈ ఫేంతోనే ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు. అయితే మొదటి వారంలోనే ఆమె ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ 5 విన్నర్ సన్నీ హీరోగా నటిస్తున్న చిత్రం సకల గుణాభిరామలో ఈమె కీలక పాత్ర చేస్తుంది.































