Bigg Boss Sohel: కెరియర్ డౌన్ ఫాల్ కావడంతో డిప్రెషన్ లోకి పోయాను… సోహెల్ కామెంట్స్ వైరల్!

0
40

Bigg Boss Sohel: బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో ముందుకు కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వెళ్లినటువంటి వారు ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సోహెల్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నటువంటి ఈ అన్న త్వరలోనే మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఆగస్టు 18వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో నాగార్జున చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఈ సందర్భంగా ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సోహెల్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేసాడు. తాను బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తనకంటూ ఎంతో మంచి గుర్తింపు వచ్చింది ఇలా ఈ కార్యక్రమంతో మంచి పేరు సంపాదించుకున్న తనకు అనంతరం అవకాశాలు లేకపోవడంతో ఒక్కసారిగా కెరియర్ పరంగా డౌన్ ఫాల్ అయిపోయాను అని తెలిపారు.

Bigg Boss Sohel: నాగార్జున గారి ధైర్యం చెప్పారు…


ఎవరికైనా జీవితంలో డౌన్ ఫాల్ ఉండడం సర్వసాధారణం అయితే దానిని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. నేను మాత్రం దానిని యాక్సెప్ట్ చేయలేకపోయానని అంతేకాకుండా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని సోహెల్ తెలిపారు. అలాంటి సమయంలో నాగార్జున గారు తనకు ఎంతో ధైర్యం ఇచ్చారని ఈ సందర్భంగా నాగార్జున గురించి అలాగే తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయినటువంటి సంఘటనల గురించి సోహెల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.