చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 5 ముందుకు సాగుతూ ఎండ్ కు వచ్చేస్తోంది. ఒకరిపై ఒకరు అరుచుకోవడం మళ్లీ మొదలైంది. నాలుగోవారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇప్పడే వీళ్ల రంగు కూడా బయటపడుతోంది. 19 మంది అడుగు పెట్టిన ఈ హౌస్ లో ప్రస్తుతం 16 మంది మిగిలారు. ఇందులో ముఖ్యంగా లోబోకు ప్రియాకు మధ్య వార్ ఓ రేంజిలో చోటుచేసుకుంది.

తాజాగా ఓ ప్రోమో స్టార్ మా రిలీజ్ చేసింది. ఇందులో విశ్వ, నటరాజ్ మాస్టర్ మధ్య మాటల యుద్ధం జరగనున్నట్లు తెలుస్తోంది. బయట యాక్టింగ్ చేస్తావు, అదే యాక్టింగ్ హౌస్‌లోనూ చేస్తున్నావు అని చెప్పడానికి నువ్వెవరు? అని విశ్వ నటరాజ్ మాస్టార్ ను అడుగుతాడు. దీనికి నటరాజ్ మాస్టర్ బరాబర్ అలాగే మాట్లాడతానని కోపంతోనే సమాధానం ఇచ్చాడు.
ఇక లోబో ప్రియాను నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. బెలూన్స్ పట్టుకొని తొలి ప్రేమకు సంబంధించి చెప్పమని అడగడంతో అందరూ వాటి గురించి చెప్పిన విషయం తెలిసిందే. అందులో సిరి లవ్ స్టోరీ అందరినీ ఆకట్టుకుంది. అయితే అక్కడ లోబో చెప్పినదానికి ప్రియా సినిమా స్టోరీలా ఉందని కామెంట్ చేయడం అతడికి నచ్చలేదని.. ఇదే విషయాన్ని నామినేషన్‌లో ప్రస్తావిస్తూ ఆమెపై దురుసుగా ప్రవర్తిస్తాడు.
అరిచనంత మాత్రానా ఇక్కడ ఏం జరగదని.. అంటుంది ప్రియా. లోబో కాసేపు ఏడుస్తూ కనిపించగా.. అతడి దగ్గరకు రవి వచ్చి ఓదార్చుతాడు. చివరకు మనస్సులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడొద్దు లోబో అంటూ ఘాటుగానే స్పందిస్తుంది ప్రియా. ప్రస్తుతం ప్రోమో వైరల్ అయింది.































