తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ లలో ఒకరైన జెస్సీ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా జెస్సీ ను బిగ్ బాస్ బయటకు పంపించేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న జెస్సీ కి బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ లో చికిత్సను అందించినప్పటికీ, ఆరోగ్యం మరింత క్షీణించడంతో బయటకు పంపించడం జరిగింది.

అయితే నిజానికి కాజల్,మానస్ లలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా, వారిద్దరినీ సేవ్ చేసి జెస్సీని హౌస్ నుంచి బయటకు పంపించేశారు. ఇక జెస్సి హౌస్ లో మొత్తం పది వారాలు ఉన్నాడు. ఇక ఈ 10 వారాలకు జెస్సీ కి భారీగానే రెమ్యూనరేషన్ అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జెస్సి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత, అతని రెమ్యునరేషన్ గురించి చర్చలు మొదలయ్యాయి.
వారానికి 1.5 లక్షల ఒప్పందంతో జెస్సీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారట. ఈ ప్రకారంగా చూసుకుంటే వారు 10 వారాలకు 15 లక్షల వరకూ రెమ్యూనరేషన్ ముట్టినట్లు సమాచారం. ఇక జెస్సీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిలిచాడు. జెస్సీ వెళ్ళిపోతూ కుటుంబ సభ్యులందరితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడాడు. ఈ నేపథ్యంలోనే పలువురికి జాగ్రత్తలు చెప్పాడు. ఇంకొందరికి వార్నింగ్ కూడా ఇచ్చారు.
హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జెస్సీ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. గత బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్స్ అలీ రేజా,రాహుల్ తో పాటు శ్వేతా వర్మ అతడికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జెస్సీ వరుస పార్టీలలో పాల్గొంటున్నారు. అంతే కాకుండా బయటకు వచ్చిన జెస్సి ని అరియానా తనదైన రీతిలో ఇంటర్వ్యూ చేసింది.































