ఈ వారం హౌస్ నుంచి శ్వేత అవుట్..! సీక్రెట్ రూంకి లోబో…

0
592

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో ఎప్పుడు.. ఏ సమయంలో ఏం జరుగుతుంతో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒకరిపై ఒకరు విరుచుకుపడతారు. చిన్న చిన్న కారణాలతో ఎలిమినేట్ చేసుకుంటారు. అయితే ప్రస్తుతం ఆరో వారు ఎండింగ్ కు వచ్చేసింది.

ఈ సారి నామినేషన్లో 10 మంది అంటే.. శ్రీరామ్ చంద్ర, సిరి, లోబో, విశ్వ, షణ్ముఖ్ జస్వంత్, ప్రియాంక, యాంకర్ రవి, జెస్సీ, శ్వేతా, సన్నీ ఉన్నారు. ఇందులో ఎక్కువగా శ్వేత, లోబో, విశ్వ డేంజర్ జోన్ లో ఉన్నట్లు మూడు రోజుల నుంచి వార్తలు కూడా వస్తున్నాయి. అందరి కంటే వాళ్లకు ఓట్ల శాతం బాగా తక్కువగా వచ్చాయని తెలిసిందే.

అయితే ఈ వారం హౌస్ నుంచి శ్వేత ఎలిమినేట్ అయినట్లు లీక్ రాజాల ద్వారా తెలిసింది. మొదటి నుంచి కూడా ఆదివారం ప్రసారమయ్యే షోలో మాత్రమే అందరికీ తెలుస్తుంటుంది. కానీ లీక్ రాజాల వల్ల ఒకరోజు ముందుగానే ఎవరు ఎలిమినేట్ అయ్యారనే విషయం తెలిసిపోతోంది. సరయు దగ్గర నుంచి మొన్న ఎలిమినేట్ అయిన హమిదా వరకు కూడా అంతా చెప్పినట్లుగానే జరిగింది. ఇది కూడా నిజం కావొచ్చనేది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇక శ్వేత ఈ వారం రవి చెప్పినది చెప్పినట్టుగా చేసి.. అడ్డంగా బుక్ అయిపోయిందనేది తెలుస్తోంది. అయితే మరో విషయం ఏంటంటే.. లోబో, ప్రియాలల్లో ఒకరు ఎలిమినేట్ అయ్యారట. అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అన్నమాట. అంటే.. ప్రియా, లోబోలల్లో లోబో ఫేక్ ఎలిమినేట్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అతడిని సీక్రెట్ రూంకి పంపించినట్లు తెలుస్తోంది. అస్సలు హౌస్ లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here