మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహైల్ సీజన్ ఫోర్ లో పాల్గొని టాప్ త్రీ కంటెస్టెంట్ గా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సోహైల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఇదివరకు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంతో మంది కంటెస్టెంట్ లు బిగ్ బాస్ విన్నర్ వాళ్లేం అంటూ ఎన్నో సార్లు ఈ కార్యక్రమం పై స్పందించారు.

అలాగే సోహైల్ కూడా బిగ్ బాస్ కార్యక్రమం గురించి గతంలో ఒకసారి పోస్ట్ చేశారు తప్పకుండా టాప్ ఫైవ్ లో కాజల్, మానస్, సన్నీ ఉంటారని పోస్ట్ పెట్టడంతో చాలామంది ఇతనికి నెగిటివ్ గా కామెంట్ చేశారు. వీళ్లు టాప్ ఫైవ్ లో ఉంటే మరి మా అభిమాన కంటెస్టెంట్ లు ఎక్కడికి వెళ్తారు అంటూ దారుణంగా కామెంట్లు చేయడంతో వారికి భయపడి వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేశానని వెల్లడించారు.
ఇదిలా ఉండగా మరొక రెండు వారాలలో బిగ్ బాస్ విజేత ఎవరు అనే విషయం తెలియనుంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంపై సోహైల్ మాట్లాడుతూ బిగ్ బాస్ విజేత ఎవరు అనే విషయం గురించి జోస్యం చెప్పారు.ఇక ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ ఈ సీజన్ లో సన్నీని చూస్తుంటే తనని తాను చూసుకున్నట్లు ఉందని సన్నీ గురించి వెల్లడించారు.ఇక ఈ సీజన్ లో శ్రీ రామచంద్ర సన్నీ వీరిద్దరిలో ఒకరు టైటిల్ తప్పకుండా గెలుస్తారని ఈయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మరి సోహైల్ చెప్పిన విధంగానే బిగ్ బాస్ ట్రోఫీ సన్నీ అందుకు ఉంటారా లేక శ్రీ రామ్ చంద్ర అందుకుంటారా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఎక్కువగా సన్నీకి బిగ్ బాస్ ట్రోఫీ అందుకునే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ షన్ను కూడా టైటిల్ రేసులో ఉన్నా సిరితో తన ప్రవర్తన కారణంగా పూర్తిగా నెగిటివిటీ ఏర్పర్చుకొని టైటిల్ రేసు నుంచి తప్పుకునే పరిస్థితికి వచ్చారని చెప్పవచ్చు.



























