pallavi prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు రైతు బిడ్డగా పలు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నటువంటి ఈయనకు ఏకంగా బిగ్ బాస్ అవకాశం వచ్చింది ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి పల్లవి ప్రశాంత్ చివరికి టైటిల్స్ సొంతం చేసుకొని అందరికీ గట్టి షాక్ ఇచ్చారు.

ఇక పల్లవి ప్రశాంత్ కు భారీ స్థాయిలో అభిమానులు ఏర్పడ్డారు అయితే ఈ అభిమానుల కారణంగానే చివరికి జైలు వరకు కూడా వెళ్లి వచ్చారు అనే సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా పల్లవి ప్రశాంత్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పల్లవి ప్రశాంత్ సినిమాలలో హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది అంటూ మరొక కంటెస్టెంట్ భోలే షావలి తెలియజేశారు.
ఈ సందర్భంగా భోలే మాట్లాడుతూ.. ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నగానే ఈయనతో సినిమాలు చేయడానికి పలువురు నిర్మాతలు ముందుకు వచ్చారని తెలిపారు. ఆయన ఒప్పుకుంటే తన హీరోగా పాట బిడ్డ మ్యూజిక్ డైరెక్టర్గా ఓ సినిమా రాబోతుంది అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మ్యూజిక్ డైరెక్టర్ గా పాట బిడ్డ…
ప్రశాంత్ హీరోగా వెండి తెరపై సందడి చేస్తారా లేదా అన్నది పూర్తిగా తన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుందని భోలే తెలిపారు. ఇక ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు శుభాకాంక్షలు తెలియజేయగా మరికొందరు మాత్రం ఈయనని హీరోగా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా తన సినిమాలను ఆదరిస్తారా అన్న సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.































