దాదాపు రైతులకు పెన్షన్ డబ్బులు అనేవి ఎంత ఉంటాయి.. మహా అయితే రూ.10 వేలు మించవు. కానీ బిహార్ లోని ఓ రైతు ఖాతాలో పెన్షన్ అమౌంట్ ఎంత క్రెడిట్ అయిందో తెలిస్తే షాక్ అవుతారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకు ఖాతాలో పొరపాటున కోట్లు జమైన ఘటన బీహార్‌లో చోటు చేసుకొన్నది.

బిహార్‌లోని ముజఫరాపూర్ జిల్లా కతిహార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు రామ్ బహుదూర్ షా కొంత కాలం కిందట వృద్దాప్య పింఛను కోసం బ్యాంక్ అకౌంట్ తెరిచాడు. ఓ రోజు అతడు పెన్షన్ డబ్బులను తీసుకొనేందుకు వినియోగదారుల సేవా కేంద్రానికి(సీఎస్‌పీ) వెళ్లగా అక్కడి ఆపరేటర్ చెక్ చేసి ఖాతాలో రూ. 52 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పడంతో బహదూర్ షా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇంత పెద్ద మొత్తం తన బ్యాంకు అకౌంట్‌లోకి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాడు. ఆ డబ్బునంతా బ్యాంకు తిరిగి తీసుకొంటుదని తెలిసి.. మేము వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని నా ఖాతాలో పడిన కొంత సొమ్ము ఇప్పిస్తే నా జీవితం ఆనందంగా గడిచిపోతుందని చెప్పారు. దీనిపై పోలీసులకు సమాచారం చేరడంతో దర్యాప్తు ప్రారంభించారు. ఈ సొమ్ము ఎలా వచ్చిందనే కోణంలో వారు విచారణ చేపడుతున్నారు.
ఇదిలా ఉండగా బీహార్‌లో ఇటీవల ఓ స్కూల్ విద్యార్థి ఖాతాల్లో ఏకంగా రూ.90 కోట్లు క్రెడిట్ అయ్యాయి. మరో విద్యార్థికి ఆరు కోట్ల రూపాయలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి ఖాతాలో రూ.5 లక్షల పడ్డాయి. ఇలా పెద్ద మొత్తంలో నగదు జమ అవుతుండటంతో బీహార్ ప్రజలు తమ ఖాతాలను చెక్ చేసుకొంటున్నారు. మరి కొంత మంది బయట రాష్ట్రాలకు చెందిన ప్రజలు బీహార్‌లో ఏదైనా ఓ బ్యాంకులో ఖాతా ఉంటే పోయేది. లైఫ్ సెటిల్ అయిపోయేది అంటూ చమత్కరిస్తున్నారు.