గుర్రపు డెక్క అంటే ఏమిటో పల్లెటూర్లో ఉండే వారికి దాదాపు తెలుస్తుంది. ఇది చెరువుల్లో, కుంటల్లో బాగా పెరుగుతుంది. ఈ గుర్రపు డెక్క మొక్కలు నీటిలో తేలియాడుతూ కనిపిస్తాయి. నీటిలో ఉన్న విషపదార్థాలను పీల్చుకుని పెరుగుతుంది. అంతే కాదు అది పెరిగేందుకు నీటిలోని ఆక్సిజన్‌ను కూడా పీల్చుకుంటుంది. ఇక ఆ నీటిలో చేపలు కూడా బతక లేవు.

అయితే ఈ మొక్కల వలన కూడా డబ్బులు సంపాదించవచ్చు అనేది ఎంత వరకు తెలుసు. అది నిజమేనండి.. ఎవరికీ పనికి రాని గుర్రపుడెక్క మొక్కతో లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టిస్తున్నారు. గుర్రపుడెక్క నుంచి యోగా మ్యాట్స్ తయారు చేస్తున్నారు. అంతే కాదు ఇతర వస్తువులను కూడా వారు తయారు చేస్తున్నారు. దాని నుండి మంచి ఆదాయం పొందుతున్నారు.
అస్సాం రాష్ట్రంలోని దీపోర్ బీల్ గ్రామం చుట్టూ నివసిస్తున్న కొందరు బాలికలు అద్భుతాలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం దీపోర్ బీల్ సరస్సు చుట్టు గుర్రపు డెక్కతో నిండిపోయింది. ఎటు చూసిన పచ్చగా కనిపించేది కానీ.. నీళ్లు మాత్రం కనిపించకపోయేవి. ఇలా ఉండటం వల్ల చేపల వ్యాపారులు ఎక్కువగా నష్టాన్ని మూడగట్టుకునే వాళ్లు.
ఇక్కడ స్థానికులు కొన్ని హస్తకళా వస్తువులను తయారు చేసేవారు. దీనిని దృష్టిలో ఉంచుకుని NECTR ఇక్కడి గ్రామస్థులకు ట్రైనింగ్ ఇచ్చింది. మొదట ఆరుగురితో మొదలైన శిక్షణ తర్వాత 40 మంది అమ్మాయిలు చేరారు. వీటితో యోగా మ్యాట్ లను సులభంగా తయారు చేస్తున్నారు. అయితే భారతదేశంలో ఈ మొక్కలు సుమారు 20-30 లక్షల హెక్టార్ల నీటి వనరుల్లో విస్తరించినట్లు అంచనా.



























