Bolly wood Producer: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఒకరిని పెళ్లి చేసుకొని మరొకరితో ఎఫైర్ కొనసాగించడం సర్వసాధారణం. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఒకరితో రిలేషన్ లో ఉండగానే మరొకరితో ఎఫైర్స్ పెట్టుకుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ సర్వసాధారణం. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రొడ్యూసర్ కమల్ కిశోర్ మిశ్రా పెళ్లి అయినప్పటికీ మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ విషయంపై తన భర్తను అనుమానించిన మిశ్రా భార్య రెడ్ హ్యాండెడ్ గా తన భర్త మరొక మహిళతో కలిసి కారులో రొమాన్స్ చేస్తున్న సమయంలో తనను పట్టుకున్నారు. ఈ విధంగా ఇంటి ఆవరణంలో కార్ పార్కింగ్ చేసి కారు లోపల మరొక మహిళతో మిశ్రా కలిసి ఉండటాన్ని గమనించిన ఆయన భార్య తలుపు తీయాలని సూచించింది.
కారులో మరొక మహిళతో ఉండటంతో మిశ్రా కంగారుపడి ఎంతసేపటికి కారు డోర్ తీయలేదు. దీంతో ఒక్కసారిగా మిశ్రా భార్య యాస్మిన్ గట్టిగా కేకలు వేసింది.ఇలా యాస్మిన్ కేకలు వేయడంతో కంగారు పడిన మిశ్రా కారు ఇంజన్ స్టార్ట్ చేసి ఆమె ఎదురు వస్తున్నప్పటికీ నిర్ధాక్షణంగా తన పైనుంచి కారును పోనించారు.
ఈ ఘటన అక్టోబర్ 10వ తేదీ జరిగినప్పటికీ చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే యాస్మిన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఘటనలో యాస్మిన్ తలకు, కాళ్లకు, పెద్ద ఎత్తున గాయాలైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

bolly wood Producer : అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు..
ఈ క్రమంలోనే ఈ ఘటనపై యాస్మిన్ మాట్లాడుతూ తన భర్త మిస్రాతో తనకు తొమ్మిది సంవత్సరాల అనుబంధం ఉందని అయితే ఆయన నాపై కారు తీసుకువెళ్లి కనీసం నేను ఎలా ఉన్నానో కూడా నాకోసం తొమ్మిది సెకండ్ టైం కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త మిశ్రా ఎంతోమంది మోడల్స్ తో అక్రమ సంబంధం పెట్టుకొని ఎంతోమంది అమ్మాయిలను ట్రాప్ చేసి వారిజీవితాలను పాడు చేస్తున్నారంటూ ఈ సందర్భంగా యాస్మిన్ మిశ్రా గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
#WATCH | Case registered against film producer Kamal Kishore Mishra at Amboli PS u/s 279 & 338 of IPC for hitting his wife with a car.She claims after the incident she suffered head injuries.We’re searching for accused. Further investigation underway:Amboli Police
(CCTV Visuals) pic.twitter.com/0JSleTqyry
— ANI (@ANI) October 26, 2022































