Pushpa Movie: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమా ఓటీటీలో ప్రసారం అవుతున్న ఎంతోమంది థియేటర్లలో చూడటానికి ఆసక్తి కనబరచడంతో థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది.

ఇకపోతే ఈ సినిమా అన్ని భాషలలో విడుదల అయినప్పటికీ హిందీలో మాత్రం ఎలాంటి ప్రమోషన్ లేకుండా విడుదల చేసిన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డు సృష్టించడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అక్కడ రికార్డులను సృష్టిస్తూ బన్నీ క్రేజ్ అమాంతం పెంచేశాయి.

ఈ క్రమంలోనే ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో వంద కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన ఈ సినిమా పై ప్రముఖ ఫిలిం క్రిటిక్ కేఆర్ కే స్పందిస్తూ అల్లు అర్జున్ పై ప్రశంశలు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ..బాలీవుడ్ సెలబ్రిటీస్ అని చెప్పుకునే ఎంతో మంది సూపర్ స్టార్స్ కు ఈ సినిమా ఒక చెంప పెట్టు లాంటిది వారు నటించిన సినిమాలు 25 కోట్లు కూడా వసూలు చేయలేకపోతున్నాయని విమర్శించారు.
పుష్ప చిత్రమే ప్రత్యక్ష నిదర్శనం..
బాలీవుడ్ సినిమాలను అక్కడి ప్రేక్షకులు ఎందుకు తిరస్కరిస్తున్నారో పుష్ప సినిమానే ఒక నిదర్శనం అని వరుస త్వీట్లు పెట్టారు. ఇక సినిమాను హిందీలో డిస్ట్రి బ్యూట్ చేసిన గోల్డ్ మైన్స్ టెలీఫిలిమ్స్ అధినేత మనీశ్ షాకు బన్నీ పుష్ప సినిమా బంగారు గని మరోసారి ట్వీట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
Film #Pushpa has done approx ₹100Cr business in Hindi circuit. Huge congratulations to @alluarjun for such a great achievement! It’s a slap on the face of Bollywood stars.
— KRK (@kamaalrkhan) January 27, 2022



























