సాధారణంగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం గురించి మనం ఎన్నో సార్లు విని ఉన్నాం. అయితే ఈ విషయం గురించి ఎంతో మంది సినీ తారలు బహిరంగంగా బయటకు చెప్పారు. ఇలా వారు కెరియర్ మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నామని తెలియజేశారు. బాలీవుడ్ నటి కాస్టింగ్ కౌచ్ గురించి చేశారు తన కెరియర్ లో కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఈమె వెల్లడించారు.

ఈమె బాలీవుడ్ నటి అయినప్పటికీ అమెరికాలో పుట్టి పెరిగింది. గత 10 సంవత్సరాల క్రితం ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన నటి నర్గీస్ ఫక్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె నటించిన మొదటి సినిమానే అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగు లేదని చాలా మంది భావించారు.
అయితే ఈ సినిమా తర్వాత ఈ హీరోయిన్ మద్రాస్ కేఫ్, మై తేరా హీరో, గూఢచారి, హౌజ్ ఫుల్ లాంటి సినిమాలలో నటించారు. ఈ సినిమాల ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు.తనకు అవకాశాలు రావాలంటే కొందరు దర్శకనిర్మాతలు తమ పక్కన పడుకోవాలని డైరెక్టుగా అడిగినట్లు ఈమె వెల్లడించారు.
అయితే తాను ఇండస్ట్రీలోకి వచ్చే సమయంలో కొన్ని పాత్రలలో నటించకూడదని కొన్ని విషయాలు ఎవరు అడిగినా ఒప్పుకోకూడదని నియమాలు పెట్టుకోవడం వల్ల అలా దర్శకనిర్మాతలు అడిగిన వెంటనే తను నో చెప్పానని అదే విషయాన్ని గుర్తు పెట్టుకొని ఇండస్ట్రీలో తనకు అవకాశాలు రాకుండా తొక్కేశారని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.



























