RRR Movie: ఇండియా మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ వాయిదా పడటం చాలా మంది ప్రేక్షకులను నిరాశ పరిచింది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మళమాళం భాషలతో పాటు వివిధ భాషల్లో జనవరి 7న సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా సినిమా మరోసారి వాయిదా పడింది.

ఎన్టీఆర్ కొమురం భీంగా, రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామ రాజుగా నటించారు. దీంతో ఈ పిరియాడిక్ డ్రామా మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ టీజర్ ప్రేక్షకుల అంచనాలను మరింతగా పెంచాయి. దీంతో పాటు బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవ్ గన్, అలియా భట్ నటిస్తుండటంతో మూవీపైన భారీ బజ్ క్రియేట్ అయింది.

RRR Movie : బాలీవుడ్ మార్కెట్ టార్గెట్ చేస్తూ..
దాదాపుగా 500 కోట్ల వ్యయంతో ఈ మూవీని తెరకెక్కించారు. అందులో రూ. 200 కోట్ల వరకు స్టార్ల రెమ్యునరేషన్ కే కేటాయించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అజయ్ దేవ్ గన్, అలియా భట్ ల రెమ్యునరేషన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. సినిమాలో కీలక పాత్రల కోసం వీరిద్దరిని ఎంచుకున్నట్లు చెబుతున్నప్పటికీ.. బాలీవుడ్ మార్కెట్ టార్గెట్ చేయడంతో పాటు.. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుండటంతో వీరిద్దరిని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం 7 రోజుల నటించినందుకే.. అజయ్ దేవ్ గన్ కు రూ. 35 కోట్లు ముట్టచెప్పినట్లు టాక్. ఇదిలా ఉంటే అలియా భట్ కు రూ. 9 కోట్లు ఇచ్చారట. మూవీలో అలియాభట్ పాత్ర కేవలం 20 నిమిషాలే ఉంటుందట. ఇంతలా భారీ రెమ్యునరేషన్లు ఇచ్చి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటింపచేశారు.































