Aliya Bhat: అమ్మ అని పిలిపించుకోవడం ప్రతి ఒక అమ్మాయి జీవితంలో ఎంతో మధురమైన అనుభూతిగా భావిస్తుంటారు.అయితే ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత తన కడుపులో పెరుగుతున్న బిడ్డ పట్ల ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇలా విశ్రాంతి తీసుకుంటూ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉండటం వల్ల బిడ్డ ఎదుగుదల ఆరోగ్యం కూడా బాగుంటుందని పెద్దలు చెబుతుంటారు.అందుకే గర్భం దాల్చిన మహిళలు తమ బిడ్డ పట్ల తన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

ఇకపోతే అలియా భట్ సైతం పెళ్లయిన మూడు నెలలకి తాను గర్భవతి అనే విషయాన్ని ప్రకటించారు. ఇలా ఈమె గర్భవతి అనే విషయం తెలియడంతో ఒకసారిగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.అయితే ఈమె గర్భవతి అని తెలియడంతో తాను కమిట్ అయిన సినిమా షూటింగ్లలో పాల్గొంటూ తొందరగా ఆ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు.ఈ విధంగా సినిమా షూటింగ్లలో పాల్గొంటూ అలియా భట్ పెద్ద తప్పు చేస్తున్నారని పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఇప్పటికే ఈమె పలు సినిమా షూటింగ్లలో పాల్గొని ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా ఒక బిల్డింగ్ పైనుంచి దూకే సన్నివేశంలో అలియా నటించారని తెలియడంతో అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు. అలియా కడుపులో బిడ్డ పెరుగుతుందన్న విషయం కూడా మరిచిపోయి తాను ఇలాంటి సాహసాలను చేస్తూ తప్పు చేస్తోంది. ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి రిస్క్ అవసరమా అంటూ పెద్ద ఎత్తున నేటిజన్ లు ఆమెపై మండిపడుతున్నారు.
బిడ్డ ఆరోగ్యం గురించి ఆలోచించలేదా…
కపూర్ వారసుడు అలియా కడుపులో పెరుగుతుండగా కనీసం కపూర్ కుటుంబ సభ్యులైన తనకి జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత లేదా కామెంట్లు చేస్తున్నారు. అయితే అలియా ఇవన్నీ పట్టించుకోకుండా తాను ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఇలాంటి సన్నివేశాలలో నటించి గొప్ప నటి అనిపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారని,ఈ క్రమంలోనే తన కడుపులో పెరుగుతున్న బిడ్డను ప్రమాదంలోకి పడేస్తున్నారు అంటూ మరికొందరు ఈమె వ్యవహారంపై మండిపడుతున్నారు.


































