సుమారు 15 సంవత్సరాల క్రితం సిద్ధార్థ్, జెనీలియా, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం బొమ్మరిల్లు. ఈ చిత్రం అప్పట్లో ఎలాంటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన భాస్కర్ కి ఈ సినిమా విజయవంతం కావడంతో అతని పేరు బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయింది. ఇలా బొమ్మరిల్లు సినిమా అద్భుతమైన విజయాన్ని అందించడంతో ఆ తర్వాత భాస్కర్ పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త సినిమాలను తెరకెక్కించిన పెద్దగా గుర్తింపు రాలేదు.

ఇలా పదిహేను సంవత్సరాల నుంచి మంచి గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ తాజాగా అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం భాస్కర్ ఏకంగా రెండున్నర సంవత్సరాల పాటు కష్టపడ్డారు. అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా విడుదల అయి బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి విజయం కోసం ఎదురుచూస్తూ విజయాన్ని అందుకున్న దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈయన రెమ్యూనరేషన్ నెలకు రెండు లక్షల చొప్పున తీసుకున్నారని సినిమా విజయం అయిన తర్వాత మరో 40 లక్షల పారితోషికం తీసుకోనున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇలా భాస్కర్ ఈ సినిమా కోసం నెల జీతం తీసుకుంటూ సినిమా కోసం కష్టపడ్డారని అయితే ప్రస్తుతం ఈ సినిమా విజయం సాధించడంతో ఈ సినిమా కోసం భాస్కర్ సుమారు 60 నుంచి 70 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి బొమ్మరిల్లు తర్వాత భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ద్వారా మరొకసారి విజయం సాధించారని చెప్పవచ్చు.
































