ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా చలి మనుపటి కంటే ఎక్కువగా చంపేస్తుంది. చలితో గజగజ వణికిపోతున్నారు జనాలు. అయితే ఈ సమయంలో ఎవరైనా స్నానం చేయాలంటే అస్సలు ఇష్టపడరు. వాయిదా వేసుకుంటూ వస్తుంటారు. వేడి నీళ్లు ఉంటేనే స్నానం చేస్తారు. కానీ ఇక్కడ ఓ పిల్లోడు చేసిన పని చూసి ప్రతీ ఒక్కరూ నవ్వుకుంటున్నారు.

కొంత మంది చలికాలంలో స్నానం చేయడానికి వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్తుంటారు. అప్పుడెప్పుడో ఓ వ్యక్తి మనిసి శరీరం అంతా అబ్రకం కవర్ తో చుట్టేసుకొని.. స్నానం చేయడం నవ్వుతెప్పించింది. ఇక్కడా ఆ పిల్లోడు చేసిన పని కూడా అలాంటిదే. అతడు బహిరంగ ప్రదేశంలో వేడి నీటి స్నానం చేయడానికి బట్టలు మొత్తం తొలగించి.. కేవలం అండర్ వేర్ తో వచ్చాడు. పొగమంచు.. వాతావరణం చల్లగా ఉంది.

చన్నీళ్లతో స్నానం చేయాలంటే ఆ బాలుడు వణికిపోతున్నాడు. దీంతో వాళ్ల పేరేంట్స్ వినూత్నంగా ఆలోచించారు. కొన్ని నీళ్లను తీసుకొని పెద్ద లోహపు కుండ (కదాయి) తీసుకొని రాళ్ళు మరియు కలపపై చేసిన తాత్కాలిక నిప్పు మీద ఉంచాడు. బాలుడు కొంచెం వేడి నీళ్ళు ఉన్న కడాయి లోపల కూర్చున్నాడు.
అప్పుడు అతను ఒక కప్పు తీసుకొని తన శరీరంపై వేడి నీటిని పోయడం మనం వీడియోలో చూడొచ్చు.
ఇది ప్రమాదకరం.. సురక్షితం కాదు:
అతడు అలా కింద నుంచి మంట.. మధ్యలో నీళ్లు.. పైన ఆ బాలుడు ఆ నీటితో స్నానం చేస్తూ.. మంచిగా ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. ఈ వ్యవహారం అంతా అక్కడే ఉన్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆ వీడియో వైరల్ గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు కొంతమంది.. బాలుడి ఆలోచన వినూత్నంగా ఉన్నప్పటికీ ఇది అత్యంత ప్రమాదకరమైన చర్య అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఎప్పటికీ సురక్షితం కాదు అంటూ సలహా ఇస్తున్నారు. అతడు తొట్టిలోకి ప్రవేశించినా.. మంట మీద నుంచి బయటకు వచ్చినా.. అతను గాయపడే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు.





























