తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథ రచయితగా, డైరెక్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వారిలో డైరెక్టర్ రాజ వన్నేం రెడ్డి ఒకరు. ఈయన దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. ఈయన దర్శకత్వంలో మా ఆయన బంగారం, మీ ఇంటికొస్తే ఏమిస్తావ్ మా ఇంటికొస్తే ఏం తెస్తావ్, క్షేమంగా వెళ్లి లాభంగా రండి వంటి ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా బ్రహ్మానందం నటించారు. అయితే బ్రహ్మానందానికి స్క్రిప్ట్ నచ్చకపోతే మారుస్తారు అనే మాటలు విని పడుతుంటాయి అది ఎంతవరకు నిజం అనే ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన మాట్లాడుతూ బ్రహ్మానందం గారు అలా ఎప్పుడూ చేయరని ఆయనకు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసని, తనవరకు బ్రహ్మానందం గురించి ఎలాంటి సమస్య లేదని వివరించారు.

ఇక క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా షూటింగ్ సమయంలో బ్రహ్మానందం కోవై సరళ బాగా గొడవ పడిన సంఘటన ఒకటి షూటింగ్ చేయాలి.అయితే ఇలా చేయాలి అలా చేయాలి అని చెబుతున్న సమయంలో మీరు ఒకసారి వచ్చి చేసి చూపించండి అని చెప్పారు. ఆ సమయంలో నేను,ఫణి ప్రసాద్ అనే నా స్నేహితుడు ఇద్దరం కలిసి ఆ సన్నివేశాన్ని చేసి చూపించాము.అతను కోవేసరల గెటప్ వేయగా నేను బ్రహ్మానందం గెటప్ లో చేసి చూపించాను.
అయితే మేము ఎలా అయితే చేసామో వారిద్దరు కూడా అలాగే చేసి ఆ సన్నివేశంలో బాగా గట్టిగా కొట్టుకున్నారని తెలిపారు.అయితే సెట్ లో ఇంత పెద్ద గొడవ జరిగి అందరూ గూమి ఉంటే రామానాయుడుగారు ఏం జరిగిందా అంటూ అక్కడికి వచ్చారని అయితే తను వచ్చిన విషయం ఎవరికీ చెప్పకుండా దూరం నుంచి నటనను చూస్తూ ఉన్నారు. చివరికి షాట్ ఓకే అయిన తర్వాత రామానాయుడు గారు మా దగ్గరకు వచ్చి భుజంపై చేయి వేసి చాలా అద్భుతంగా చేశారు. కీప్ ఇట్ అప్ అంటూ తనని పొగిడారని, తనతో ఒక సినిమా చేస్తానని ఆరోజు రామానాయుడుగారు చెప్పారని ఈ సందర్భంగా డైరెక్టర్ రాజా వన్నెం రెడ్డి వెల్లడించారు.






























