ఏ మహిళకు అయినా తల్లి అవ్వడం అనేది దేవుడు ఇచ్చే వరం లాంటిది. అయితే ఇలా ఓ మహిళకు గర్భం దాల్చితే ప్రమాదం అని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె తల్లి.. తన కూతురు బిడ్డకు జన్మనివ్వడానికి ఒప్పుకుంది. 53 ఏళ్ల వయస్సులో ఆమె తన మనుమరాలికి జన్మనిచ్చి ఔరా అనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బ్రెజిల్ దక్షిణ భాగంలోని సెయింట్ కాటరినా నగరంలో ఉన్న టీచర్ రోసిక్లియా డి అబ్రూ కార్సెమ్ అనే మహిళకు ఓ 29 ఏళ్ల కూతురు ఇంగ్రిడ్ ఉంది.

ఆమెకు ఫాబియానా అనే వ్యక్తితో పెళ్లైంది. ఆమెకు పల్మనరీ ఎంబోలిజం అనే వ్యాధి ఉంది. ఈ వ్యాధితో బాధపడే వారు గర్భం దాల్చి బిడ్డలకు జన్మనిస్తే.. తల్లి రక్తం గడ్డకట్టి చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో ఆమె పిల్లలు కనే అవకాశం లేకుండా పోయింది. ఓ రోజు ఇంగ్రిడ్ టీవీలో చూసిన ఓ కార్యక్రమం ద్వారా ఆమె ఓ విషయాన్ని గ్రహించింది.
అదేంటంటే.. తన కూతురుకు ఇలానే ఓ వ్యాధి ఉండగా.. తన తల్లి మనవరాలికి ఐవీఎఫ్ ద్వారా జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వెళ్లి తన తల్లికి చెప్పడంతో ఆమె కూడా సంతోషంగా ఒప్పుకుంది. దీంతో IVF ద్వారా బిడ్డకు జన్మనిచ్చేందుకు అంతా సిద్దం అయింది. వారు పేదవారు కావడంతో ఆ పద్ధతి కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సేకరించారు.
ఫేస్ మాస్కులు అమ్మి.. చిన్నా చితకా పనులు చేసి డబ్బులను కూడపెట్టారు. దీంతో ఐవీఎఫ్ ద్వారా ఆమె తన మనుమరాలికి జన్మనిచ్చింది. ఆమె మాట్లాడుతూ.. తన కూతురుకు, మనవరాలికి జన్మనివ్వడం అనేది చాలా సంతోషంగా ఉదంటూ రోసిక్లియాడి అబ్రూ కార్సెమ్ చెప్పుకొచ్చింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లువెరిసింది.































