Breaking News: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఈ విషయం తెలిసినటువంటి క్రికెట్ అభిమానులు ఎంతో ఆందోళన చెందుతూ ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

ఉత్తరాఖండ్‌లోని మంగళూరు సమీపంలో డిసెంబర్ 30వ తేది శుక్రవారం రోజు ఉదయం 5.15 గంటల ప్రాంతంలో క్రికెటర్ రిషబ్ పంత్ ప్రమాదానికి గురయ్యారు. ఈయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన రేయిలింగ్ ను ఢీకొనింది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి కారు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రిషబ్ తలకు మొహం పై వీపు భాగంలో పెద్ద ఎత్తున గాయాలైనట్టు తెలుస్తోంది.

Breaking News:
ఇక ప్రస్తుతం ఈయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇతని ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలియజేయడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు . అయితే ఈయన ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన క్షేమంగా కోలుకోవాలని ఎంతో మంది క్రికెట్ అభిమానులు ప్రార్థిస్తున్నారు.


























