పెళ్లికూతురుకు ఆ అలవాటు ఉండకూడదట.. పెళ్లి ప్రకటన వైరల్…?

0
411

ఈ మధ్య కాలంలో మనుషుల ఆలోచనా తీరు మారుతోంది. పెళ్లి విషయంలో నచ్చిన అబ్బాయే కావాలని అమ్మాయిలు, నచ్చిన అమ్మాయే కావాలని అబ్బాయిలు మొండిగా వ్యవహరిస్తున్నారు. తమకు నచ్చిన లక్షణాలు ఉన్న వధువు/వరుడు దొరకకపోతే మ్యాట్రిమొనీల ద్వారా, పెళ్లి ప్రకటనల ద్వారా వారి కోసం వెతుకుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వ్యక్తి వింత పెళ్లి ప్రకటన వైరల్ అవుతోంది.

పశ్చిమ బెంగాల్‌ లోని కమన్పూర్ కు చెందిన న్యాయవాది చటర్జీ పేపర్ లో తనకు సోషల్ మీడియాకు అడిక్ట్ కాని అమ్మాయి కావాలని, ఆ అమ్మాయి అందంగా పొడవుగా ఉండాలని ప్రకటన ఇచ్చాడు. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ యువతీయువకుల జీవితంలో భాగమైపోయాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు సందేశాల ద్వారా మాత్రమే సమాచారం అవతలి వ్యక్తులకు చేరుతోంది. సోషల్ మీడియా యాప్స్ కు యువతీయువకులు బానిసలవుతున్నారు.

ఈ కాలంలో సోషల్ మీడియా యాప్స్ వినియోగించని వధువు లేదా వరుడు కావాలని ఆశిస్తే అది అత్యాశే అవుతుంది. చటర్జీ ‌ అనే 5 అడుగుల 7 అంగుళాల ఎత్తు ఉన్న న్యాయవాది, పరిశోధకుడు పేపర్ లో ఈ ప్రకటన ఇచ్చాడు. అతనికి ఇళ్లు, కార్లు అనీ ఉన్నాయి. అయితే అతని మనస్సులో ఏముందో తెలియదు కానీ ఇలాంటి వింత ప్రకటనను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అతనికి జన్మలో పెళ్లి కాదని కామెంట్లు పెడుతున్నారు.

అయితే వృత్తిపరంగా ఎన్నో కేసులను చూడటం వల్లే చటర్జీ అలాంటి అభిప్రాయానికి వచ్చి ఉంటాడని మరి కొందరు భావిస్తున్నారు. కొందరు నెటిజన్లు మాత్రం భార్యకు కనీసం సోషల్ మీడియా యాప్స్ వినియోగించే స్వేచ్ఛ కూడా ఇవ్వరా..? అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హెచ్.ఐ.వీ పాజిటివ్ ఉన్న మహిళకు ఒక కులానికి చెందిన వరుడు కావాలనే ప్రకటన వైరల్ కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెళ్లి ప్రకటన హల్చల్ చేస్తోంది.