పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. రూ.80 వేల వరకు ఆదా..?

0
150

కేంద్ర ప్రభుత్వం మరో ఐదు రోజుల్లో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం కేంద్రం ఏకంగా 80 వేల రూపాయల వరకు పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే దిశగా నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో బడ్జెట్ లో కీలక నిర్ణయాలకు చాన్స్ ఉండనుందని సమాచారం.

బడ్జెట్ 2021పై సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఉద్యోగులు, వ్యాపారులు ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచవచ్చని తెలుస్తోంది. సాధారణంగా స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత మిగిలిన ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్ డిడక్షన్ తగ్గింపు వల్ల పన్ను చెల్లింపుదారులకు అదనపు భారం తగ్గుతుంది. లక్ష రూపాయల వరకు స్టాండర్డ్ డిడక్షన్ ఇవ్వాలని పన్ను చెల్లింపుదారుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సీఐఐ సైతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని చెబుతోంది. ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రతికూల ప్రభావం పడిన నేపథ్యంలో 2020 – 2021 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో కీలక ప్రతిపాదనలు వెలువడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఫిబ్రవరి 1 వరకు ఆగితే మాత్రమే ఊహాగానాలు నిజమో కాదో తెలిసే అవకాశాలు ఉంటాయి.

అయితే గత బడ్జెట్ తో పోలిస్తే ఈ బడ్జెట్ లో కీలక మార్పులు ఉంటాయని తెలుస్తోంది. కేంద్రం అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా బడ్జెట్ లో అనేక మార్పులు చేసిందని అందరికీ ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరేలా బడ్జెట్ ను రూపొందించిందని తెలుస్తోంది.