సాధారణంగా రోడ్లు వేయాలంటే ఇసుక ,కంకర, సిమెంట్ మొదలైనవి ఉపయోగించి రోడ్లను వేయడం మనం చూస్తూ ఉంటాం… కానీ మీరెప్పుడైనా మనుషుల ఎముకలతో రోడ్లను వేయడం చూశారా? అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం రష్యా దేశంలో మనుషుల ఎముకలతో రోడ్లను వేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు… పూర్తి వివరాల్లోకి వెళితే..

రష్యాలోని కిరెన్స్క్ ప్రాంతంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురుస్తుండడంతో ప్రయాణికులకు ఎంతో ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు వారి కోసం వేసిన పార్టిశాన్ అలిమోవ్ స్ట్రీట్ రోడ్డు పై ప్రయాణిస్తున్న వారికి ఆ రోడ్డుపై మనుషుల ఎముకలు, పుర్రెలు వంటి వింత ఘటనలు కనిపించాయి. ఒక్కసారిగా మనుషులు ఎముకలు, పుర్రెలు కనిపించేసరికి అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారి చివరకు పోలీసుల కంట్లోపడ్డాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో భాగంగా ఆ ప్రాంతంలో లభించిన ఎముకలు వంద సంవత్సరాల క్రితం నాటివని తెలుస్తుంది.

1917_1920 మధ్య జరిగిన రష్యా సివిల్ వార్ లో చనిపోయిన వ్యక్తి కి సంబంధించినవి కావచ్చని,మెట్రో యూకే తెలిపింది. అయితే ఆ ప్రాంతంలో లభించినవి మనుషులు ఎముకలే అని తెలిసినా కూడా అధికారులు స్పందించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ లభ్యమైన పుర్రె ఎవరిది అన్న దానిపై నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో లభ్యమైన ఎముకల్ని సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపినట్లు అధికారులు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here