విద్యార్థులకు బంపర్ ఆఫర్.. నెలకు లక్ష రూపాయలు అందిస్తున్న ఎస్బీఐ!

0
286

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. దేశంలో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారి నుంచి పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఫెల్లోషిప్ కొరకు ఎస్బీఐ దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఎవరైతే రీసెర్చ్ ఫెల్లోషిప్ కు ఎంపికవుతారో వారికి నెలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఎస్బీఐ స్టైఫండ్ రూపంలో అందించే ఈ మొత్తం పొందాలంటే ఈ నెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఎస్బీఐ ఫెల్లోషిప్ కు ఎంపికైన అభ్యర్థుల యొక్క పనితీరును ఫెల్లోషిప్ చివరలో పరిశీలించి అద్భుతమైన పనితీరును ప్రదర్శించిన వారికి 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు స్టైఫండ్ కు అదనంగా చెల్లించనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఎస్బీఐ ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఎస్బీఐ కల్పిస్తోంది. సెప్టెంబర్ నెల 18వ తేదీన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 8వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది.

పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేయడానికి మరో 48 గంటల సమయం మాత్రమే ఉంది. https://www.sbi.co.in/careers లేదా https://bank.sbi/careers వెబ్ సైట్ల ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 5 మందికి మాత్రమే ఫెల్లోషిప్ అందించనుంది. 2020 జూలై 31 నాటికి 40 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ ఉన్నవాళ్లు ఈ ఫెల్లోషిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫెల్లోషిప్ లో జాయిన్ అయిన రోజు నుంచి 24 నెలల పాటు కాంట్రాక్ట్ ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారు ఎంపికైతే వారి ఈ మెయిల్ కు కాల్ లెటర్ వస్తుంది. అనంతరం ఇంటర్వ్యూ ద్వారా 5 మందిని ఎంపిక చేస్తారు. ఐటీ లేదా ఎకనమిక్స్‌ లేదా బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ లో పీహెచ్డీ చేసిన వాళ్లు ఫెల్లోషిప్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే వాళ్లకు టీచింగ్ లేదా రీసెర్చ్‌ వర్క్ కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి. జర్నల్స్ రాసిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here