కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. ఇకపై దేశవ్యాప్తంగా పంటలు పండించిన రైతుల నుంచి కనీస మద్దతు ధరకే పంటలను కేంద్రం కొనుగోలు చేయనుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది. కేంద్రం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పంట సేకరణ చేస్తోంది.

గతేడాదితో పోలిస్తే 19.42 శాతం ఎక్కువగా రైతుల నుంచి కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కేంద్రం ఇప్పటివరకు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో రైతుల నుంచి 243 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. కేంద్రం కొనుగోలు చేసిన ధాన్యంలో 171 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పంజాబ్ రాష్ట్రం నుంచే కొనుగోలు చేయడం గమనార్హం. పంజాబ్ తో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేసింది.

45,900 కోట్ల రూపాయలు కేంద్రం ధాన్యం కొనుగోలు కోసం ఖర్చు చేసిందని తెలుస్తోంది. 20 లక్షలకు పైగా రైతులకు కేంద్రం మద్దతు ధరల నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూర్చింది. వరి, వేరుశనగ, సోయాబిన్ లాంటి ధాన్యాలను కేంద్రం రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఇతర పంటలను కూడా కేంద్రం రైతుల నుంచి కొనుగోలు చేస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా, లాక్ డౌన్ సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో కేంద్రం రైతుల కోసం ఎప్పటికప్పుడు కొత్తకొత స్కీమ్ లను ప్రవేశపెడుతూ రైతులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. పలు పథకాల ద్వారా కేంద్రం రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here