ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రపంచ దేశాల్లోని లక్షల ప్రజల జీవితాల్లో అనేక మార్పులకు కరోనా వైరస్ కారణమవుతోంది. తాజాగా కరోనా మహమ్మారికి సంబంధించి మరో కొత్త లక్షణం వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు జుట్టు ఎక్కువగా రాలుతున్నా కరోనా వైరస్ సోకినట్లేనని చెబుతున్నారు. కరోనా వైరస్ గురించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం శాస్త్రవేత్తల ప్రయోగాలు కొనసాగుతున్నాయొ. శాస్త్రవేత్తలు వచ్చే సంవత్సరం జనవరి నాటికి కరోనాను కట్టడి చేసే సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొదట్లో జలుబు, జ్వరం, దగ్గు మాత్రమే శాస్త్రవేత్తలు కరోనా వైరస్ లక్షణాలుగా గుర్తించారు. అయితే తాజాగా శాస్త్రవేత్తల పరిశోధనల్లో కరోనా సోకిన వాళ్లలో జుట్టు రాలుతోందని తేలింది. ఇండియానా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ మరియు సర్వైవర్ కార్ప్ ఫేస్‌బుక్ గ్రూప్ సర్వేల్లో కరోనా సోకిన వాళ్లలో జుట్టు రాలటం లాంటి లక్షణాలను గుర్తించారు. 1500 మందిపై శాస్త్రవేత్తలు సర్వే చేసి ఈ విషయాలను తేల్చారు.
కొందరిలో కరోనా నిర్ధారణ అయిన తరువాత జుట్టు రాలే సమస్య కనిపిస్తోందని ఒక రకంగా ఒత్తిడి సైతం జుట్టు రాలే సమస్యకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే జుట్టు రాలడం గురించి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.































