తమిళనాడులోని నీలగిరి హిల్స్ లోఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా కెప్టెన్ మాత్రం వరుణ్ సింగ్ మాత్రం కొన ఊపిరితో బయటపడ్డారు. ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ ఆయన సతీమణి కూడా మృతి చెందారు. ఇదిలా ఉండగా కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కెప్టెన్ మెరుగైన వైద్య చికిత్స కోసం వెల్లింగ్ టన్ మిలిటరీ ఆస్పత్రికి తరలించారు.

మిల్లింగ్ టెన్ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆయన ఎలాగైనా ప్రాణాలు నుంచి బయటపడాలని ఎంతోమంది ఆకాంక్షిస్తున్నారు. ఈయన చికిత్స చేయడం కోసం చెన్నై నుంచి ప్రముఖ వైద్యులు అక్కడి చేరుకున్నట్లు తెలుస్తోంది. వరుణ్ సింగ్ విషయానికి వస్తే ఈయన గత ఏడాది ఇలాంటి ప్రమాదం నుంచి తృటిలో తప్పి బయటపడ్డారని తెలుస్తుంది.
ఆయన నడుపుతున్నటువంటి విమానం కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రమాదానికి గురైతే ఎంతో చాకచక్యంగా విమానం ల్యాండ్ చేశారని ఇతని ధైర్యసాహసాలకు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం శౌర్యచక్ర అవార్డుతో సత్కరించింది. ఇక ఈ ప్రమాదంలో భాగంగా గాయాలపాలైన వరుణ్ సింగ్ సర్జరీ తర్వాత ఆయన తన భార్యతో మాట్లాడాలని భావించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఈ ప్రమాదం జరిగే సమయంలో వరుణ్ సింగ్ భార్య ముంబైలో తన సోదరుడు ఇంట్లో ఉన్నారు. ప్రమాద విషయం తెలియగానే కుటుంబ సభ్యులు హుటాహుటిన వెల్లింగ్ టన్ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని ఆయన ఎలాగైనా ఈ ప్రమాదం నుంచి బయట పడాలని ఎంతోమంది ఆకాంక్షిస్తున్నారు.































