న్యూఢిల్లీ: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ మీదుగా అందుబాటులో ఉన్న అభ్యంతరకర, అశ్లీల కంటెంట్‌కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గంభీరంగా స్పందించింది. ఈ క్రమంలో కంటెంట్ నియమాలను ఉల్లంఘిస్తూ అభ్యంతరకరమైన దృశ్యాలను ప్రసారం చేస్తున్న 25 ఓటీటీ యాప్స్‌పై కేంద్ర ప్రసారాల మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. ఉల్లు (Ullu), ఆల్ట్ (Altt), దేశీఫ్లిక్స్ (DesiFlix), బిగ్ షాట్స్ (Big Shots) సహా పలు ప్లాట్‌ఫార్మ్స్ ఈ జాబితాలో ఉన్నాయి.

నిషేధానికి కారణాలు, ఆదేశాలు
ప్రభుత్వానికి అందిన వివిధ దర్యాప్తు సంస్థల నివేదికల ప్రకారం, ఈ యాప్స్ అభ్యంతరమైన కంటెంట్‌ను తమ వెబ్‌సైట్‌లు, మొబైల్ యాప్‌ల ద్వారా పలుమార్లు ప్రసారం చేస్తున్నట్లు తేలింది. దీనితో పాటు, వీటికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు (ISPs) స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తూ, ఈ యాప్స్ మరియు వాటి వెబ్‌సైట్ల లింకులను పూర్తిగా బ్లాక్ చేయాలని సూచించింది. ఇకపై ఈ 25 ఓటీటీ యాప్స్ కు సంబంధించిన మొబైల్ అప్లికేషన్లు, వెబ్‌సైట్లు భారతదేశంలో పనిచేయవు. అవి అందించే కంటెంట్‌ను ఎవరూ చూడలేరు.
భారతీయ చట్టాలు మరియు డిజిటల్ మీడియా నిబంధనలను పాటించకపోతే, తదుపరి మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరించింది. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ తమ కంటెంట్ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే విషయాన్ని మరోసారి స్పష్టంగా సూచించింది.
నిషేధించబడిన ఓటీటీ యాప్స్ జాబితా:
- ఉల్లు (Ullu)
- ఆల్ట్ (Altt)
- దేశీఫ్లిక్స్ (DesiFlix)
- బిగ్ షాట్స్ (Big Shots)
- షోఎక్స్
- సోల్ టాకీస్
- అడ్డా టీవీ
- హాట్‌ఎక్స్ వీఐపీ
- హల్‌చల్ యాప్
- మూడ్‌ఎక్స్
- నియాన్‌ఎక్స్ వీఐపీ
- ఫ్యుగి
- మోజ్‌ఫిక్స్
- ట్రైఫ్లిక్స్
- గులాబ్ యాప్
- కంగన్ యాప్
- బుల్ యాప్
- జాల్వా యాప్
- వావ్ ఎంటర్‌టైన్‌మెంట్
- లుక్ ఎంటర్‌టైన్‌మెంట్
- హిట్‌ప్రైమ్
- ఫినియో.
ఈ నిర్ణయం నేపథ్యంగా, భారతీయ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ల భద్రత, కంటెంట్ ప్రమాణాల విషయంలో ప్రభుత్వ దృక్పథం మరింత స్పష్టంగా కనిపిస్తోంది.































