సమంత నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నామని అధికారకంగా తెలియజేసి 10 రోజులు అవుతున్నప్పటికీ సమంత నాగ చైతన్యల విడాకుల గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే సమంతకు నాగచైతన్య విడాకులు ఇవ్వడానికి కారణం ఇదేనా అంటూ చాలా మంది వివిధ రకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇందులో ముఖ్యంగా సమంత స్పెషల్ డిజైనర్ ప్రీతమ్ తో తనకు ఉన్న రిలేషన్ ఏ కారణం అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయంపై సమంత డిజైనర్ ప్రీతమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఇతను చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా ప్రీతమ్ తెలియజేస్తూ తనకు సమంత కు మధ్య ఏ విధమైనటువంటి సంబంధం ఉందో ఆ సంబంధం గురించి నాగచైతన్యకు ముందే తెలుసు. నేను సమంతను జీజీ (అక్క) అని పిలుస్తానని మా ఇద్దరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉందనే విషయం నాగచైతన్యకు తెలుసంటూ ప్రీతమ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇలా మా ఇద్దరి మధ్య ఎంతో స్వచ్ఛమైన సంబంధం ఉన్నప్పుడు చాలా మంది మా ఇద్దరికీ అఫైర్స్ ఉన్నట్లు వార్తలు రాస్తున్నారని ఈ సందర్భంగా ప్రీతమ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.































