Chaitanya Master: ప్రస్తుత కాలంలో ప్రజలు ప్రతి చిన్న కష్టానికి కూడా చావే పరిష్కారంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఢీ షోలో డాన్స్ మాస్టర్ గా గుర్తింపు పొందిన చైతన్య తాజాగా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. మాస్టర్ చైతన్య మరణం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. చైతన్య ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశాడు.

ఈ వీడియోలో చైతన్య తన బాధ వెల్లడించాడు. ఆర్థిక సమస్యలు అధికమవడం వల్ల అప్పులు చేశానని. అప్పులు తీర్చే సత్తా ఉన్నప్పటికీ ఒకదాని వెంట సమస్యలు తలెత్తడంతో వాటిని భరించటం తన వల్ల కావడం లేదని చైతన్య చెప్పుకొచ్చాడు. అప్పులు అధికం అవటం వల్ల ఆ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. ఇక నా జీవితంలో ఇదే చివరి రోజు అంటూ తల్లిదండ్రులతో పాటు తన వల్ల బాధపడిన అందరికీ క్షమాపణలు తెలియజేశాడు.
చైతన్య మరణ వార్త గురించి తెలియగానే అతని సన్నిహితులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చైతన్య కుటుంబ సభ్యులు సన్నిహితులు చివరిసారిగా చైతన్య పార్టీల దేహాన్ని చూడటానికి వెళ్లారు. పలువురు సినీ ప్రముఖులు స్నేహితులు చైతన్య మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో యాంకర్ రష్మీ కూడా చైతన్య మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ఎమోషనల్ అయింది.

Chaitanya Master: సమస్యకు ఇది పరిష్కారం కాదు…
డాన్స్ మాస్టర్ చైతన్య తో రష్మీకి మంచి స్నేహబంధం ఉంది. అయితే చైతన్య ఇలా అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించటంతో రష్మి చాలా ఎమోషనల్ అయింది. ఈ క్రమంలో ” ‘నీ సమస్యకు ఇది పరిష్కారం కాదు చైతన్య. ఫ్యామిలీకి సన్నిహితులకు ఆ దేవుడు మనోధైర్యం ప్రసాదించాలి. నీ ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ రష్మీ గౌతమ్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.































