Chakri Death: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో చక్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీతం అందించిన చక్రి 2014వ సంవత్సరంలో గుండెపోటుతో మరణించారు. ఇక ఈయన మరణించే సమయంలో ఈయన మరణం గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.

ఇకపోతే తాజాగా చక్రి సోదరుడు మహిత్ నారాయణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చక్రిమరణం గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టారు.అన్నయ్య మరణం మమ్మల్ని ఎంతగానో కృంగతీసిందని ఇప్పటికే ఆ మరణం నుంచి అమ్మ కోలుకోలేకపోతుందని ఈయన తెలిపారు. టీవీ పెట్టాలంటేనే భయం ఎక్కడ అన్నయ్య పాటలు వస్తే అమ్మ ఏడుస్తుందోనని, పెట్టకపోతే అన్నయ్య గొంతు వినలేమేమో అనే బాధ మరొకవైపు అంటూ తెలిపారు.
ఇక అన్నయ్య మరణం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి అయితే ఆయన మరణించే సమయానికి మేము ఇంట్లో లేము వదినతో వచ్చిన గొడవల వల్లే నేను అమ్మ వేరుగా ఉంటున్నాము అయితే అన్నయ్య చనిపోయే ముందు రోజు రాత్రి మా ఇంటికి వచ్చి వెళ్లిపోయారు తెల్లవారితే అన్నయ్య చనిపోయారనే వార్త విన్నాము.అయితే అన్నయ్య మరణం పై తనకు ఇప్పటికి సందేహాలు ఉన్నాయని అన్నయ్యది సహజ మరణమే అయితే ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదని ఈయన ప్రశ్నించారు.

Chakri Death:అమ్మ విషయం పెట్టిందని ఆరోపణలు…
ఇక ఆరోజు రాత్రి అన్నయ్య మా ఇంటికి రావడంతో మా అమ్మ తనకు విషం పెట్టి చంపిందని పోలీసులకు మాపై ఫిర్యాదు చేశారని ఈయన ఆవేదన వ్యక్తం చేశారు.కడుపులో పెట్టుకొని చూసుకునే తల్లి కన్న కొడుకుకు విషయం పెట్టి ఎలా చంపుతారు మా దురదృష్టం మేము ఈ విషయాన్ని నిరూపించుకోలేకపోయాము అంటూ ఈ సందర్భంగా మహిత్ చక్రి మరణం గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































