Chalaki Chanti: జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన చలాకి చంటి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కమెడియన్ గా గుర్తింపు పొందిన చలాకి చంటి ప్రస్తుతం అనారోగ్యం వల్ల ఆసుపత్రి పాలయ్యాడు. ఇటీవల తీవ్రమైన గుండెపోటు రావటంతో అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఇదిలా ఉండగా….ఎన్నో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన చంటికి సరైన గుర్తింపు లభించలేదు. ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా చంటి కి కమెడియన్ గా మంచి గుర్తింపు లభించింది.

ఇలా జబర్దస్త్ వల్ల వచ్చిన గుర్తింపుతో సినిమాలలో నటించే అవకాశాలు అందుకోవటమే కాకుండా బుల్లితెర మీద ప్రసారమైన అనేక టీవీ షో లలో కమెడియన్ గా మాత్రమే కాకుండా యాంకర్ గా కూడా సందడి చేశాడు.
అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కూడా పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకి వచ్చిన తర్వాత చంటి ఎక్కువగా ప్రేక్షకుల ముందు కనిపించడం లేదు. రెండు మూడు టీవీ షోలలో పాల్గొన్న చంటి సినిమాలలో అసలు కనిపించలేదు.
దీంతో చంటి కి అవకాశాలు తగ్గాయని అందువల్లే ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇటీవల చలాకీ చంటికి తీవ్రమైన గుండెపోటు రావటంతో ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించినట్లు మీడియా వర్గాల నుండి సమాచారం.
ఇటీవల 21వ తేదీ అనారోగ్యం పాలవటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చంటి నీ పరీక్షించిన వైద్యులు గుండెపోటు అని తేల్చి చెప్పారు. దీంతో చంటి నీ వెంటనే ఐసియుకి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

Chalaki Chanti: రక్తనాళాలలో పూడికలు…
తాజాగా చంటి అనారోగ్యం గురించి స్పందించిన వైద్యులు ఆయన రక్తనాళాలలో కూడికలు ఉన్నాయని అందుకే స్టంట్ వేసామని వైద్యులు వెల్లడించారు. చంటి అనారోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అలాగే జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా చంటిని పరామర్శిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం చంటి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.































