Chalaki Chanti: చలాకి చంటి పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని బుల్లితెరపై పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి చంటి అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన కొన్ని వారాలపాటు హౌస్ లో కొనసాగి అనంతరం ఎలిమినేట్ అయ్యారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనంతరం చంటి ఏ ఇతర కార్యక్రమాలలో కూడా సందడి చేయలేదు. జబర్దస్త్ కార్యక్రమంలోనే కాకుండా స్టార్ మాలో ప్రసారమవుతున్నటువంటి ఏ కార్యక్రమాలలో కూడా ఈయన కనిపించలేదు. దీంతో ఈయనకు అవకాశాలు రాలేదేమోనని అందరూ భావించారు. అయితే ఈయన అనారోగ్య సమస్యల కారణంగా ఏ కార్యక్రమాలలో కనిపించలేదని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే గత రెండు నెలల క్రితం చంటి ఉన్నఫలంగా గుండెపోటుకు గురి కావడంతో ఈయనని హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని వార్తలు వచ్చాయి. ఇలా ఈయన గుండెపోటుకు గురి కావడంతో యాంకర్ అనసూయతో పాటు ఇతర జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఈయనకు అండగా నిలిచారు. ఇలా చంటి ఆరోగ్యం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఉన్నఫలంగా ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశారు.

Chalaki Chanti: హెల్త్ బాగున్నట్టేనా…
తాజాగా వచ్చేవారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా చలాకి చంటి కనిపించడంతో చంటి తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చారని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈయన ఆరోగ్యం గురించి అభిమానులు పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం తీవ్ర అనారోగ్య సమస్యలకు గురైనటువంటి చంటి ఆరోగ్యం ప్రస్తుతం కుదటపడినట్లేనా అందుకే తిరిగి ఇండస్ట్రీలోకి వచ్చారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.