Chalaki Chanti: బుల్లితెరపై ప్రసారం అవుతూ అద్భుతమైన కామెడి ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ప్రతి వారం ఈ కార్యక్రమం ద్వారా కమెడియన్స్ తమ అద్భుతమైన కామెడీ స్కిట్ ద్వారా ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తూ ఉంటారు.ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ప్రస్తుతం ఈ ప్రోమో పై పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రోమోలో భాగంగా ముఖ్యంగా చలాకి చంటి చేసిన స్కిట్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఎంతో ఎమోషన్ కూడగట్టుకొని పాడిన కొమరం భీముడో పాట ఎంత ఫేమస్ అయ్యిందో మనకు తెలిసిందే. ఈ పాటలో ఎన్టీఆర్ నటించడం కాకుండా జీవించాడని అందరూ ప్రశంసలు కురిపించారు. ఇకపోతే జబర్దస్త్ కార్యక్రమంలో చలాకి చంటి ఈ పాటను ఏకంగా మందు పాటగా మార్చేశాడు.

కొమరం భీముడో పాటను చలాకి చంటి మందు పాటగా మారుస్తూ…విస్కీదేవాలా బ్రాండీ దేవాలా.. గ్లాసుల ఐసేసీ మాకే బొయ్యాలా.. మాకే బొయ్యాలా.. బుట్ట పక్కనా కోడిని చూడాలా.. కోడిని దీసుకొచ్చీ కోసీ వండాలా.. సుక్క సుక్కకీ ముక్క ముక్కతో జుర్రుకోవాలా.. దొబ్బితాగాలా.. అంటే పూర్తిగా మందు పాటగా మార్చేశాడు. ఈ క్రమంలోనే ఈ పాటకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిన కొమరం భీమ్ పాట..
ఇక ఈ వీడియో చూసిన ఎన్టీఆర్ అభిమానులు చలాకి చంటి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ఎంతో ఎమోషనల్ గా ఈ పాట పాడి అందరిలో ఎంతో స్ఫూర్తిని నింపారు. ఇలా ఎంతో స్ఫూర్తి దాయకంగా ఉండే ఒక పాటను చలాకి చంటి ఇలా మందుతో పోల్చి పాడటం ఏంటి? ఎంతో గొప్ప సందర్భంలో ఎన్టీఆర్ పాడిన ఈ పాటను తాగుబోతుల పాటగా చలాకి చంటి పాడటంతో అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమదైన శైలిలో చలాకి చంటి స్కిట్ పై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






























