Chandra Mohan: కళాతపస్వి కే విశ్వనాథ్ అనారోగ్య సమస్యలతో గురువారం రాత్రి అపోలో ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే. ఇలా ఈయన మరణ వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే ఈయనని కడసారి చూడటం కోసం పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు తరలివచ్చారు. చంద్రమోహన్ కూడా నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ విశ్వనాధ్ గారిని చివరిసారి చూడటం కోసం వచ్చారు.

ఇలా చంద్రమోహన్ విశ్వనాథ్ గారు నిర్జీవంగా పడి ఉండటం చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి వెక్కివెక్కి ఏడ్చారు. ఆయనని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయిన చంద్రమోహన్ గారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఇలా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్ సిరిసిరిమువ్వలు అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఈయన డప్పు కొట్టుకునే ఓ కళాకారుడి పాత్రలో నటించారు. ఈ సినిమా చంద్రమోహన్ సినీ కెరియర్ ను ఓ మలుపు తిప్పిందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో చంద్రమోహన్ మాట్లాడుతూ తనకు తన సినీ కెరియర్లో బాగా సంతృప్తిని కలిగించిన చిత్రం సిరిసిరిమువ్వలని తెలిపారు.

Chandra Mohan: పంజాగుట్టలో విశ్వనాథ్ అంత్యక్రియలు…
ఈ విధంగా తన సినీ కెరియర్ ను ఓ మలుపు తిప్పిన కళాతపస్వి విశ్వనాథ్ గారు మరణ వార్తను చంద్రమోహన్ జీర్ణించుకోలేకపోయారు. తనకు జీవితాన్ని ఇచ్చిన ఓ గురువు మరణించడంతో ఆయన కడసారి చూపు కోసం నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఇద్దరి సహాయంతో అక్కడికి వచ్చి విశ్వనాథ్ గారిని చూసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈయన పార్తివదేహానికి నివాళులు అర్పించి ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ఈయన అంత్యక్రియలు హైదరాబాద్ పంజాగుట్ట స్మశాన వాటికలో సాంప్రదాయ ప్రకారం జరిగాయి.