ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఛార్మి, తాజాగా నిర్మాతగా మారి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా నిర్మాతగా మారిన ఛార్మి ప్రస్తుతం పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ చార్మి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

తాజాగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, చార్మి నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం “లైగర్”. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ పనులలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన విషయాలను, వ్యక్తిగత విషయాలను, తనకెంతో ఇష్టమైన తన పెట్ గురించి చార్మి నిత్యం అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఛార్మి పలు సందర్భాలలో తన తల్లిదండ్రుల గురించి అభిమానులతో ముచ్చటించారు. తాజాగా ఛార్మి తన తండ్రి సేవలో మునిగిపోయారు. తన తండ్రికి కాళ్లను ఒత్తుతూ చివరికి ఆయన పాదాల చెంతకు చేరాను అంటూ తన తండ్రికి పాద సేవ చేస్తున్నటువంటి వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


































