సాధారణంగా ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు.ఈ క్రమంలోనే వారు నటించింది కేవలం కొన్ని సినిమాలలో అయినప్పటికీ ఆ పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఉంటాయి.అలాంటి పాత్రలో ఒకటే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చత్రపతి సినిమాలోని సూరీడు పాత్ర అని చెప్పవచ్చు.

చత్రపతి సినిమాలోని సూరీడు పాత్ర అందరికీ గుర్తుంటే గుర్తుంటుంది. ఈ సినిమాలో ఈ పాత్ర ప్రభాస్ పాత్రను ఎంతో హైలెట్ చేసే విధంగా ఉంటుంది. ఈ విధంగా సూరీడు పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన ఆ కుర్రాడి పేరు భశ్వంత్ వంశీ. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకుందాం.

చత్రపతి సినిమా ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు దాదాపు 100 మంది ఉండగా రాజమౌళి కేవలం మొదటి రౌండ్ లోనే భశ్వంత్ ను ఎంపిక చేసినట్లు తెలిపారు.ఈ కుర్రాడు ఆ పాత్రకు వందశాతం న్యాయం చేయగలరని భావించిన జక్కన్న మొదటి రౌండ్లోనే తనని ఎంపిక చేశాడు. అయితే జక్కన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆ పాత్రకు సరైన న్యాయం చేశారని చెప్పవచ్చు.
చిన్నప్పుడు సూరీడు పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన భశ్వంత్ ఇప్పుడు ఎంతో పెద్దగా మారిపోయారు. ఈ క్రమంలోనే ఇతని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు చూసిన ఎంతో మంది నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు చిన్నప్పటి సూరీడా ఇక్కడ అంటూ కామెంట్లు చేస్తున్నారు.



























