Chavi Reddy: సెకీ విద్యుత్ ఒప్పందం గురించి వైకాపా మాజీ నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అలాగే మాజీ మంత్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అర్ధరాత్రి కాడ జగన్ గారు అందరిని సంతకాలు చేయమని కోరారని బాలినేని ఈ విషయంపై జగన్మోహన్ రెడ్డి పట్ల విమర్శలు కురిపించడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. ఇలా ఇద్దరు మధ్య మాటలు యుద్ధం నడుస్తోంది.

ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..వాసన్న మాటలు చూస్తే జాలి వేస్తుంది. సెకితో ఒప్పందం పై గొప్పగా చెప్పాల్సింది పోయి.. రెండుసార్లు మంత్రిగా పనిచేశా.. రెండు సార్లు సంతకాలు చేశా ఫార్వర్డ్ చేశాను అని చెప్పడం చాలా బాధాకరం. మీరు కేవలం ఎమ్మెల్సీ పదవి కోసం దిగజారిపోయి ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇక ఈయన చంద్రగిరి నుంచి పోటీ చేయడం పట్ల కూడా బాలినేని తప్పుపట్టారు.. మీ నియోజకవర్గం కొండెపి కదా.. ఒంగోలు నుంచి ఎందుకు పోటీ చేశారు?. మీ నాయకుడు(పవన్ కల్యాణ్) పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకెళ్లారని, చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్లారని బాలినేనిని చెవిరెడ్డి ప్రశ్నించారు. నేను మీలాగా విలువలు లేని రాజకీయాలు చేయలేదు నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి వైయస్సార్ గారికి అభిమానిని ఇప్పటివరకు కూడా నేను అదే పార్టీలో కొనసాగుతున్నాను ఇకపై పార్టీ కూడా మారను.

Chavi Reddy: జగన్ ను ఇబ్బంది పెట్టారు..
మన పార్టీలో జగనన్న మీకు ఇచ్చిన స్వేచ్ఛను ఒకసారి గుర్తు చేసుకోండి మీరు ఇతర పార్టీ నేతలతో కలిసి రష్యాకు ఇతర విదేశాలకు వెళ్లినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అభ్యంతరం చెప్పలేదు. అదే ఇప్పుడు కనుక మీరు ఇతర పార్టీ నేతలతో స్పెషల్ ఫ్లైట్లో వేరే దేశాలకు వెళ్లి రండి మీరు తిరిగి ఫ్లాట్ దిగి వచ్చేలోపు చంద్రబాబు నాయుడు మీ పదవి ఊడగొడతాడు. జగనన్నను మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించారు. ఇప్పుడు కూడా తనపై అసత్యపు ప్రచారాలు చేసిన ధైర్యంగా ఎదుర్కొంటాము ఏదో ఒక రోజు మీకు జగనన్న ఇచ్చిన స్వేచ్ఛ తప్పక గుర్తుకొస్తుంది అంటూ చెవిరెడ్డి తెలిపారు.




























