బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తండ్రి నందకుమార్ బఘేల్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రాహ్మణుల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఇటీవల ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడంతో పాటు అతడిని రాయ్‌పూర్ కోర్టులో హాజరు పర్చగా కోర్టు ఆయనకు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం భూపేష్ బాగల్ తండ్రి నంద్ కుమార్ బాగల్ మాట్లాడుతూ.. బ్రాహ్మణులను గ్రామాల్లోకి రానివ్వవద్దని పిలుపునిచ్చారు. బ్రాహ్మణులను మీ ఊళ్లోకి రానివ్వకుండా చూడాలని.. అందరం కలిసి బ్రాహ్మణులను బహిష్కరిద్దామని సీఎం తండ్రి పిలుపునిచ్చారు. గంగా నది నుంచి వాళ్లను ఓల్గా నదికి పంపించాలన్నారు.
వాళ్లు విదేశీయులు అంటూ వ్యాఖ్యానించారు. నందకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డీడీ నగర్ పోలీస్ స్టేషన్‌లో సర్వ్ బ్రాహ్మిణ్ సమాజ్ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఒక సీఎం తండ్రిపై కేసు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ స్పందించారు.
అతడు మాట్లాడుతూ ఒక కొడుకు అతడిని నేను గౌరవిస్తాను కానీ.. భారతదేశ సిద్దాంతాలకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా.. ఏదైనా పని చేసినా . ప్రజలు మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉంటే..సహించనని అతడు వ్యాఖ్యానించాడు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు.





























