బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ భార్య చేతిలో ఎంతో అందంగా ముద్దుగా ఉన్నటువంటి ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా..? ఈ కుర్రాడు ఎవరో తెలియకపోతే చిన్న క్లూ.ప్రస్తుతం ఇతని పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది… అవును మీరు అనుకుంటున్నది నిజమే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్. ఒక స్టార్ హీరో కొడుకుగా ఎంతో పాపులారిటీ ఉన్న ఆర్యన్ తన తండ్రి వారసుడిగా ఇండస్ట్రీ లకి రావాల్సిన సమయంలో డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్ళాడు.

ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది నెటిజన్లు గురించి పలు విషయాలు తెలుసుకోవాలని సోషల్ మీడియా వేదికగా అతని కోసం పెద్ద ఎత్తున సెర్చింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఆర్యన్ ఖాన్ షారుక్ ఖాన్ గౌరీ ఖాన్ దంపతులకు పెద్దకొడుకు. ఇతను 1997 నవంబర్ 13వ తేదీ జన్మించారు.
ఆర్యన్ ఖాన్ విద్యాభ్యాసం మాత్రం సెవెన్ ఓక్స్ పాఠశాల లండన్ లో విద్యాభ్యాసం పూర్తిచేసి యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలీఫోర్నియానుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇకపోతే బాలనటుడిగా అడుగుపెట్టిన ఆర్యన్
కభీ ఖుషీ కభీ గమ్’ మూవీలో బాలనటుడిగా అతిధి పాత్రలో (రాహుల్) షారుఖాన్ చిన్నప్పటి పాత్రలో సందడి చేశారు. ఈ సినిమాలో రాహుల్ పాత్రకు జయాబచ్చన్ సవతి తల్లిగా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న ఫోటోనే ఇది.
చిన్నప్పుడే బాలనటుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆర్యన్ ‘హమ్ లజవాబ్ హైన్’ సినిమాలో తేజ్ పాత్రకు , లయిన్ కింగ్ హిందీ వెర్షన్‌లో సింబా పాత్రకు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పాడు. హీరో గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న సమయంలో ఆర్యన్ ఇలా డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
































