Chinmayi Sripadha : సమంతని అందుకే సపోర్ట్ చేస్తాను… సింగర్ కార్తీక్ ఎంతోమంది అమ్మాయిలను వేదించాడు… ఎన్టీఆర్ తెలియదు అంటే ట్రోల్ చేస్తారా : చిన్మయి శ్రీపాద

0
893

Chinmayi Sripadha : ‘ఏ మాయచేసావే’ సినిమాతో సమంత కు డబ్బింగ్ చెప్పి ఇక ఆ సినిమాలో పాటలు పాడి తెలుగునాట మంచి గుర్తింపు తెచ్చుకుంది సింగర్ చిన్మయి శ్రీపాద. కేవలం గాయని గానే కాకుండా ఆర్జే గా అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే కాకుండా సమాజంలో అమ్మాయిల మీద జరిగే లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ‘మీ టూ’ ఉద్యమకారిని గా కూడా పనిచేస్తున్న చిన్మయి ఇటీవలే తల్లయింది. ఇక తన ప్రెగ్నెన్సీ అలాగే డిలీవరి గురించి అత్యంత గోప్యంగా ఉంచి ప్రసవం తరువాత తనకు కవల పిల్లలు పుట్టినట్లు తెలిపారు చిన్మయి. ఇక తన కెరీర్ లో ఎదుర్కొన్న సవాళ్ళను అలాగే సమంత తో తన స్నేహం గురించి చెప్పారు.

సమంతను అందుకే సపోర్ట్ చేస్తా… ఎన్టీఆర్ తెలియదు అయితే…

ఏ మాయచేసావే సినిమా టైం నుండి సమంత సినిమాలన్నిటికీ చిన్మయి నే డబ్బింగ్ చెప్పింది. సమంతకు చినమ్మయి గొంతు చాలా చక్కగా సరిపోవడం వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగా వర్క్ అవుట్ అయింది. ఇక వాళ్లిద్దరూ మంచి స్నేహితులు కూడా అయ్యారు. చిన్మయి భర్త రాహుల్ ‘అందాల రాక్షసి’ హీరో కూడా సమంత కు మంచి మిత్రుడు, ఇలా ముగ్గురుకి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇక సమంత కు ప్రతి విషయంలో సపోర్ట్ గా ఉండే చిన్మయి సమంత ఎలా కష్టపడి కెరీర్ లో వచ్చిందో అలాగే ఒక మంచి హ్యూమన్ గా ఎలా ఎదిగిందో నాకు తెలిసు, సామ్ సహాయం చేసినపుడు అందరికి దేవత అదే సమంత ఒక సినిమాలో ఎక్సపోసింగ్ చేస్తే ట్రోల్ చేస్తారు, ఆమె చేసిన సహాయం అప్పుడే మర్చిపోతారా అంటూ చిన్మయి అభిప్రాయపడ్డారు.

ఇక తనను ఫెమినిస్ట్ అంటూ సోషల్ మీడియాలో బూతులతో మాట్లాడినా  నేను పట్టించుకోనని, అది వాళ్ల క్యారెక్టర్ ను చూపిస్తుంది అంతే అంటూ చెప్పారు. ఇక ఒక హీరోయిన్ ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదు అన్నందుకు ఆమెను ట్రోల్ల్స్ చేసారు అంత నెగెటివ్ ఎందుకు, మీకు ఇష్టమైన హీరో కాబట్టి ఒక ఎమోషన్ ఉంటుంది కానీ ఆమెకు ఆ హీరో తెలియాలని లేదు కదా. వదిలేస్తే పోయే విషయాన్ని ఎందుకు ఆమెను వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం అందుకే ఆ సమయంలో మీరచోప్రా కు నేను అండగా నిలబడ్డాను అంటూ చెప్పారు

కార్తీక్ విషయంలో జరిగింది అది…

సింగర్ కార్తీక్ తన తోటి లేడీ సింగిర్స్ ను లైంగిక వేధింపులకు గురించేసేవాడంటూ చిన్మయి ఆరోపించారు. 2018 టైములో ఇది బాగా సంచలనం సృష్టించింది. మీ టూ అంటూ ఈ వేధింపుల గురించి సోషల్ మీడియా ద్వారా ఇంకా ఎంతో మంది అమ్మాయిలు పంచుకోవడంతో కార్తీక్ మీద లైంగిక వేధింపుల కేసు కూడా పడింది. అయితే కార్తిక్ అవన్నీ ఆరోపణలని చెప్పారు. ఇక చిన్మయి ని ఈ విషయంలో చాలా మంది కామెంట్స్ కూడా చేసారు. ఇక సింగర్ మనో చిన్మయి కి ఫోన్ చేసి ఎందుకు కార్తిక్ విషయంలో ఇలా చేస్తున్నావ్ అని అడిగారు, అతను కస్టపది పైకి వచ్చాడు కదా అని చెప్పారు. అందరూ కెరీర్ లో కష్టపడే పైకి వస్తారు నేను కష్టపడి పైకి వచ్చాను, ఇలాంటి వివాధాల్లో ఇరుకున్నాను కదా. అయినా అతను సహచర లేడీ గాయనులను అవకాశాలు ఇప్పిస్తానని తనతో డేట్ చేయాలి, కమిట్మెంట్ ఇవ్వాలంటూ వేదిస్తున్నాడు ఇది మాకు తెలిసు అంటూ చెప్పారట. ఇక మనకు తెలిసిన వ్యక్తి అయితే తప్పు చేసినా చూసి చూడనట్లు వదిలేయకూడదు అంటూ చిన్మయి చెప్పారు.