Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నవారికి ఎదుగుదల ఉంటుంది. కానీ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టే వారిని అణిచివేయాలని ఎంతోమంది చూస్తుంటారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది టాలెంటెడ్ హీరోలను ఇండస్ట్రీలో తొక్కేయడం వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారని చెప్పాలి. అయితే చిరంజీవి మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో చిరంజీవి ఎదుగుదలను చూసి ఓర్వ లేనటువంటి కొందరు ఆయనపై ఏకంగా విష ప్రయోగం చేసి తనని చంపేయాలని కూడా కుట్రలు పడ్డారని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిరంజీవి తనపై జరిగినటువంటి విష ప్రయోగం గురించి మరోసారి గుర్తు చేసుకున్నారు.
తాను మరణం మృదంగం సినిమా షూటింగ్ చేస్తున్న సమయం తనపై ఈ విష ప్రయోగం జరిగిందని చిరంజీవి తెలియచేశారు. ఈ సినిమా షూటింగ్ విరామ సమయంలో ఒక అభిమాని తన వద్దకు వచ్చి తన బర్త్ డే అని చెప్పి తనతో కేక్ కట్ చేయించారని చిరు తెలిపారు. అయితే కేక్ తనకు స్పూన్ తో తినడం అలవాటు కానీ ఆ అభిమాని మాత్రం బలవంతంగా తన చేతితో కేక్ తినిపించారు.

Chiranjeevi: వశీకరణ పొడి కలిపారట…
కేక్ తిన్న వెంటనే తనకు చాలా చేదుగా అనిపించింది వెంటనే కేక్ మొత్తం పడేసానని ఈ విషయం చిత్ర బృందానికి చెప్పగా వెంటనే తనని పట్టుకున్నారని చిరు తెలిపారు. ఇక కేక్ శాంపుల్ టెస్టింగుకు పంపించగా అందులో విషం కలిపినట్టు రిపోర్ట్స్ వచ్చాయని చిరు తెలిపారు. అయితే తనని పట్టుకొని బాగా కొట్టగా నేను ఆ అభిమానితో మాట్లాడలేదని.. కేరళ నుంచి ఏదో వశీకరణ పొడి తెచ్చి కేకులో కలిపానని చివరికి ఆ అభిమాని ఒప్పుకున్నారని తెలిపారు. అయితే తాను అభిమానిని ఏమీ అనకుండా వదిలేసానని చిరు అప్పటి విషయాలను గుర్తు చేస్తున్నారు.

































