Chiranjeevi: గత కొంతకాలంగా మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ వివాదం రెండు కుటుంబాల మధ్య అలాగే కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో ఈ వివాదానికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో అల్లు అరవింద్ ఒక మెట్టు కిందికి దిగారని తెలుస్తోంది. త్వరలోనే తన కుమారుడు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో హైదరాబాదులో నిర్వహించే ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కోరారట.

ఈ విధంగా తన తండ్రి చెప్పడంతో అల్లు అర్జున్ కూడా చేసేదేమి లేక తన సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా రావాలని చిరంజీవిని చెప్పడంతో చిరంజీవి తనకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా వేడుకకు రాలేనని అయినప్పటికీ పుష్ప 2 ప్రమోషన్ కోసం నేను కూడా ఒక చిన్న వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తానని చెప్పారట.

Chiranjeevi:అల్లుడికి మద్దతుగా మామ..
చిరంజీవి ఇందుకు ఒప్పుకోవడం వెనుక సురేఖ ప్రమేయం ఉందని తెలుస్తుంది. కేవలం చిరంజీవి కారణంగా తన అల్లుడు సినిమాకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో సురేఖ చెప్పడం వల్ల చిరంజీవి కూడా ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా చిరంజీవి పుష్ప 2 సినిమా కోసం ముందుకు రావడంతో మెగా అల్లు కుటుంబాల మధ్య వివాదానికి దాదాపు చెక్ పడినట్లేనని అందరూ భావిస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది కూడా తెలియాల్సి ఉంది.































