ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాపించి ఉన్న కరోనా పరిస్థితులలో నటుడు సోనూసూద్ చేస్తున్న కృషి ఎనలేనిది. మొదటి దశ కరోనా వ్యాపిస్తున్న సమయం నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది నిస్సహాయులకు సహాయం చేస్తూ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఈ క్రమంలోనే సోనుసూద్ చేస్తున్నటువంటి సేవలను పలు నేషనల్ మీడియా సంస్థలు, తెలుగు ఛానల్ లో ప్రచారం చేస్తున్నారు.

నటుడు సోనుసూద్ తరహాలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి సైతం కరోనా బాధితుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. కరోనా బాధితుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలోనూ సొంత డబ్బులతో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రాణదానం చేస్తున్నారు. ఇదేవిధంగా ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ వంటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవలు చేస్తున్నటువంటి మెగాస్టార్ సహాయాన్ని ఏ ఒక్క మీడియా ఛానల్ కూడా గుర్తుపట్టలేదని మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విపత్కర పరిస్థితులలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నటువంటి ఈ బృహత్తరమైన కార్యానికి మీడియా నుంచి ఏ మాత్రం సపోర్ట్ లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి చేసే కార్యక్రమాలు ప్రజలకు చేరడం లేదని అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సహాయానికి ఏమాత్రం స్పందించలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నటువంటి సహాయ సహకారాలను ప్రజలందరికీ తెలియాలంటే మెగాస్టార్ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేయాలని మెగా అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. చిరంజీవి అనుకుంటే న్యూస్ ఛానల్ పెట్టడం పెద్ద సమస్య కాదని,కేవలం ఈ విషయంలో మాత్రమే కాకుండా గత తొమ్మిది సంవత్సరాల నుంచి చిరంజీవి చేస్తున్నటువంటి ఒక మంచి కార్యం కూడా న్యూస్ ఛానల్స్ తెలియ చేయకపోవడం ఎంతో విడ్డూరమని మెగా అభిమానులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేస్తే అతను చేసే సేవలు ప్రజల వరకు చేరుతాయని అభిమానులు భావిస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు మెగా కుటుంబం ఒక న్యూస్ ఛానల్ ఏర్పాటు చేస్తారా లేదా అనే విషయం గురించి ఎదురు చూడాల్సిందే.
































