Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా చిరంజీవి వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేశారు. ఈ సినిమా మార్చి 1వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగానే గత రాత్రి ప్రీ రిలీజ్ జరిగిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవికి యాంకర్ సుమ కొన్ని ప్రశ్నలు వేసింది. ఈ సందర్భంగా సుమా మాట్లాడుతూ మాకు చిరు లీక్స్ అంటే చాలా ఇష్టం అయితే ఈ చిరు లీక్స్ నుంచి వరుణ్ లవ్ లీక్స్ మాకు రాలేదు. ఆ లవ్ లీక్స్ మీ వరకు రాలేదా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెబుతూ వరుణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరుణ్ ప్రతి విషయంలోనూ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటానని చెబుతాడు. ప్రతి విషయం నాకే చెబుతాడు తన తండ్రికి చెప్పుకోని విషయాలు కూడా నా వద్ద చెబుతూ ఉంటాడు కానీ తన ప్రేమ విషయాన్ని మాత్రం నా దగ్గర దాచాడు అంటూ కొడుకు పై చిరు కోపం ప్రదర్శించారు. చిరంజీవి ఇలా మాట్లాడటంతో వరుణ్ వెంటనే స్పందిస్తూ…
భయంతో కూడిన గౌరవం…
తన ప్రేమ విషయం చెప్పకపోవడానికి భయంతో కూడిన గౌరవమే కారణమని వరుణ్ తెలిపారు. తాను తన ప్రేమ విషయాన్ని ఎప్పుడు బయటపెట్టిన అది మొదట పెదనాన్నకే చెప్పానని తెలిపారు. ఇలా ప్రేమించుకున్నటువంటి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెద్దన సమక్షంలో గత ఏడాది నవంబర్ ఒకటవ తేదీ పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.



























