Chiranjeevi: మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని తాగుతున్నాయి. తాజాగా మెగా కోడలు ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగిన పది సంవత్సరాలకు వీరిద్దరు తల్లిదండ్రులయ్యారు. ఇంతకాలం పిల్లల విషయంలో ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొన్న ఈ జంట తాజాగా తల్లిదండ్రులయ్యారు. గతేడాది డిసెంబర్ లో రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అప్పటినుండి మెగా వారసుడి కోసం అభిమానులు మెగా కుటుంబ సభ్యులు ఎంతో అద్భుతగా ఎదురుచూశారు. మొత్తానికి మంగళవారం ఉదయం ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

మెగా ప్రిన్సెస్ రాకతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. మరొకవైపు మెగా కుటుంబంలో కూడా సంబరాలు మిన్నంటాయి. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మెగా ప్రిన్సెస్ రాకతో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ఈ క్రమంలో చిరంజీవి ట్వీట్ చేస్తూ ..” మెగా ప్రిన్సెస్ కి స్వాగతం.. నీ రాకతో కొట్లాదిమంది మెగా కుటుంబ సభ్యుల్లో సంతోషం నింపావు. రామ్ చరణ్ ఉపాసనని తల్లిదండ్రులు చేసి మమ్మల్ని గ్రాండ్ ని పేరెంట్స్ చేశావు. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు” అంటూ ట్వీట్ చేశాడు.

Chiranjeevi: సంతోషంగా ఉండాలి…
ఇక మరొక వైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేసాడు. ఈ మేరకు ” తల్లిదండ్రుల క్లబ్ లోకి మీ ఇద్దరికీ స్వాగతం.. ఈ సమయంలో బేబీ గర్ల్ తో మీరు గడిపిన క్షణాలు జీవితాంతం తీపి జ్ఞాపకాలుగా గుర్తుంటాయి. మీ ముగ్గురు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుండగా .. ఎన్టీఆర్ అభిమానులు కూడా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Congratulations @AlwaysRamCharan and @upasanakonidela. Welcome to the parents club. Every moment spent with the baby girl will be an unforgettable memory for a life time. May God bless her and you all with immense happiness.
— Jr NTR (@tarak9999) June 20, 2023































