Chiranjeevi: ఒకప్పుడు బుల్లితెరపై మాత్రమే టాక్ షోలు వచ్చేవి కానీ ప్రస్తుతం ఓటీటీలకు మంచి ఆదరణ రావడంతో ఓటీటీలలో కూడా టాక్ షోలను నిర్వహించారు.ఈ క్రమంలోనే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇలా ఈ కార్యక్రమం తరహాలోనే సోనీ లీవ్ లో కూడా సింగర్స్ స్మిత వ్యాఖ్యాతగా ఓషో ప్రారంభం కానుంది.

సింగర్ స్మిత వ్యాఖ్యాతగా సోనీ లీవ్ లో నిజం విత్ స్మిత అనే టాక్ షో ప్రారంభం కానుంది. ఈ టాక్ షో ఫిబ్రవరి 10వ తేదీ ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా మొదటి ఎపిసోడ్ లోనే మెగాస్టార్ చిరంజీవి హాజరైనట్టు తెలుస్తుంది.

ఇలా మెగాస్టార్ చిరంజీవికి స్మిత ఘన స్వాగతం పలికారు అదేవిధంగా తన సినీ కెరియర్ గురించి ఈమె ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలోనే తాను ఇండస్ట్రీలో హీరోగా ఎదుగుతున్న సమయంలో తనకు ఎదురైనటువంటి చేదు అనుభవాలు, అవమానాలు గురించి కూడా స్మిత ప్రశ్నించారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తనకు జరిగినటువంటి ఒక చేదు సంఘటన గురించి చెప్పుకొచ్చారు.

Chiranjeevi: జగిత్యాలలో చేదు అనుభవం…
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలో హీరోగా ఎదుగుతున్న సమయంలో ఓసారి జగిత్యాలకు వెళ్లినట్లు తెలిపారు. అక్కడ అభిమానులు తనకి ఘన స్వాగతం పలికారని తెలిపారు.ఇలా కొందరు తనకు పువ్వులతో స్వాగతం పలుకగా మరికొందరు తనపై కోడిగుడ్లు విసిరారు అంటూ ఈ సందర్భంగా చిరంజీవి తనకు జరిగిన చేదు సంఘటన గురించి ఈ సందర్భంగా తెలిపారు. దీంతో ఈ ప్రోమో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
































