సాధారణంగా విమాన ప్రమాదాలు సంభవిస్తే బతికి బయటపడటం చాలా చాలా అరుదైన విషయం. ఒకవేళ అలా బ్రతికితే వారికి అదొక పునర్జన్మ అని చెప్పవచ్చు. 99.9 శాతం మంది విమాన ప్రమాణాలలో బతకడం అసహజం. కానీ సుమారు 28 సంవత్సరాల క్రిందట జరిగిన ఒక విమాన ప్రమాదంలో ఏకంగా 272 మంది బ్రతికి బయట పడ్డారు.అసలు ఇది కలలో కూడా ఊహించని విధంగా ప్రమాదం సంభవించడంతో వారందరూ బయటపడటం నిజంగా వారందరికీ ఒక పునర్జన్మ అని చెప్పవచ్చు.

272 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం కొన్ని సాంకేతిక సమస్యల వల్ల గాలిలోకి ఎగిరలేకపోయింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సిన నేపథ్యంలో ఒక వరి పొలాలలో ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికి ప్రాణ నష్టం కలగకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన 60 మంది సినీ ప్రముఖులు ఇదే ఫ్లైట్ లో ఉండడం విశేషం.

వీరందరూ చెన్నై నుంచి హైదరాబాద్ బయలుదేరుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో మన టాలీవుడ్ స్టార్ హీరోస్ చిరంజీవి వెంకటేష్ విజయశాంతి అల్లురామలింగయ్య వంటి తదితర హీరోలు ఉండటం గమనార్హం. ఆ రోజు కనుక ఏమాత్రం తేడా జరిగిన ఈరోజు ఇండస్ట్రీలో ఇలాంటి స్టార్ హీరోలు ఉండేవారు కాదు.
































