Raveena Tandon: కేజిఎఫ్ సినిమా ద్వారా స్టార్ నటిగా మారిపోయిన నటి రవీనా టాండన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.‘ఫత్తర్ కే ఫూల్’’అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. హిందీతో పాటు తెలుగులో కూడా రథసారధి, బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాలలో నటించారు.

ఈ విధంగా దక్షిణాది సినిమాల్లోనూ బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన రవీనాటాండన్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ చిత్రం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా విజయవంతం కావడంతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తను ఇండస్ట్రీలోకి రాకముందు ఎలాంటి పనులు చేసేది అనే విషయాల గురించి ముచ్చటించారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రవీనాటాండన్ మాట్లాడుతూ 1990 ముందు వరకు తనకు సినిమాల్లోకి రావాలన్న ఆలోచన రాలేదని తెలిపారు. కాలేజీ చదువుతున్న రోజుల్లో జెనెసిస్ పీఆర్‌లో ఇంటర్న్‌షిప్‌కు వెళ్లాను. అక్కడ యాడ్ ప్రహ్లాద్ కక్కర్‌కు సహాయంగా ఉండటమే కాకుండా స్టూడియోలో పనిచేస్తూ ఫ్లోర్ శుభ్రం చేసే దాన్ని, అలాగే ఎవరైనా వాంతి చేసుకున్న దానిని కూడా శుభ్రం చేసేదాన్ని అని తెలిపారు.
నన్ను మోడల్ చేసింది అతనే…
అక్కడే తన స్నేహితులతో కలిసి పనిచేస్తున్న ఈమెను తన స్నేహితులు ఎన్నోసార్లు చాలా అందంగా ఉన్నావు సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అని చెప్పేవారు. అప్పుడే నాలో ఉన్న మోడల్ ను గుర్తించింది మాత్రం శాంతను షీరే అనే ఫోటోగ్రాఫర్, డైరెక్టర్. అతని నన్ను మోడల్ గా నిలబెట్టారు. ఇలా మోడల్ గా ఉన్న తనకు సినిమా అవకాశాలు వచ్చాయని అయితే తాను సినిమాలు చేయడానికి ఒప్పుకోకపోవడంతో ప్రహ్లాద్ కక్కర్‌కు సూచన మేరకు హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని ఈ సందర్భంగా రవీనాటాండన్ కి తన గతం గురించి తెలియజేశారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.




























