ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన జీవిత భాగస్వామి నారా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా హృదయస్పర్శగా స్పందించారు. ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

“నీ ప్రేమ, నీ శక్తి మన కుటుంబానికి పునాది. ఒడిదుడుకుల్లో నా పక్కనే నిలిచావు. నిన్ను భాగస్వామిగా పొందడం నా అదృష్టం,” అంటూ చంద్రబాబు ఎమోషనల్ మెసేజ్‌తో తన అభిమానాన్ని, కృతజ్ఞతను వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఈ సందేశం సామాజిక మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. భార్యాభర్తల మధ్య బంధానికి ఇది ఒక అందమైన ఉదాహరణగా పలువురు అభిప్రాయపడుతున్నారు.



































